Saturday, April 20, 2024
- Advertisement -

అక్కడ ఏ ఒక్కడు ఉన్నా ఈ ముగ్గురు తెలుగు హీరోలు డబ్బింగ్ చెప్పరు..

- Advertisement -

డబ్బింగ్ చెప్పడానికి వీళ్ళు సినిమాలకు కొత్తా అంటే అబ్బే.. కాదండి.. పోనీ సిగ్గా, ఊహా.. మరి బిడియమా, చ చ అదేం కాదు.. ఇవన్నీ కాకుండా మరి ఏంటి అంటే…

మన తెలుగు సినిమా హీరోల్లో ప్రదానంగా ముగ్గురు హీరోలకు నాలుక మందమో నత్తో .. వెర్రో.. ఇంకా మీ ఇష్టం ఏదైనా అనుకోండి.. వీళ్ళు డబ్బింగ్ చెప్పాలంటే డబ్బింగ్ థియేటర్‌లో ఒక సౌండ్ ఇంజనీర్ తప్ప మరెవ్వరు ఉండొద్దు..ఎందుకంటే వీళ్ళు టేకులు కేకుల్లాగా తీసుకుంటారు.. సినిమాల్లో ఈ హీరోలు మాట్లాడే పదాలు కూడా వీళ్ళ నాలుకలకి అనువైనట్లే రైటర్ రాస్తారు… కాని అవి కూడా సింకులో చెప్పరు. ఒక హీరో డైలాగ్ చెబితె సినిమా హాలు టాపు లేచిపోతుంది.. విలన్ గుండెల్లో రైల్లు పరుగెడతాయి.. అభిమానులు ఆనందంలో గంతులేస్తారు. కానీ అది సినిమాలోనే బయట ఎక్కడైన ఒక్క వాక్యం తప్పులేకుండా తడబడకుండ చెప్పమనండి.. ఆ… హై… ఊ…ఊహు… ఓలా.. అనే రీ రికార్డింగ్ బ్యాక్ డ్రాప్‌లో వేసుకోవాల్సిందే… ఇక ఇంకో హీరో సినిమాలో డైలాగ్ చెబితే.. నరాలు వేడెక్కుతాయి.. బాడి జివ్వుమంటుంది.. దీనబ్బ జీవితం వెళ్ళి తెరను చింపెయ్యాలి లేదా.. ఎదుటి వాన్ని చంపెయ్యాలి అనిపిస్తుంది… ఇది సినిమా వరకే కాని బయట ఇతను మాట్లాడితే… గంట సమయం ఇస్తే మూడు మాటలు మాట్లాడుతాడు… అందులో 30 బూతూలు వెతుక్కోవచ్చు…

ఇక ఇంకో హీరో సినిమాల్లో ఇతని మాటలు వింటే అమ్మాయిలు అమాంతం వెళ్ళి ఆ హీరోని hug చేసుకోవాలనిపిస్తుంది…  అబ్బాయిల్లో కూడా అతను అంటే మాంచి క్రేజ్ ఉంది.. ఇక ఇతనైతే బయట మాట్లాడితే తతత.. తమ్ముడు చెప్ప్‌ప్పాడు.. నినినిన్న.. షూషూషూట్ అయ్యిందిదిది… ఓరి దేవుడోయ్ ఆపర బాబోయ్ అని అనాలనిపిస్తుంది.. కాని ఎంతైనా హీరో కదా… ఏమీ అనలేము.. అయినా.. సినిమాల్లో డైలాగ్స్ మనకు మాంచి కిక్‌నిస్తున్నాయి కదా.. అదే చాలు.. అంతే కాని బయట వీళ్ళ మాటాలు వినాలనుకోవద్దు.. ఎందుకంటే తట్టుకోలేరు…

వినండి సినిమాలోనే బయట కాదు.. ఒకవేళ మీ ఖర్మ.. వింటే ఫస్ట్ నవ్వుకుంటారు… ఆపై కోపం వస్తుంది.. ఇంకా వింటే పిచ్చెక్కుతుంది.. ఇంకా వింటే మాడిపోతారు… ఇంతకి ఎవరా ముగ్గురు హీరోలు.. just think…. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -