Friday, March 29, 2024
- Advertisement -

చిరు మూవీ కోసం మహేష్ కి ఎంతో రెమ్యునరేషనో తెలుసా ?

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవీ, కొరటాల శివ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం రామ్ చరణ్ ని ఎంపిక చేశారని ప్రచారమైనా.. ఆర్ ఆర్ ఆర్ మూవీలో బిజీగా ఉండటం వల్ల రామ్ చరణ్ స్థానంలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో గానీ..స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో గానీ ఆ పాత్ర చేయించాలని అనుకున్నారు.

మొత్తానికి మెగా ఫ్యామిలీ హీరో కాకుండా.. బయట స్టార్ హీరో అయితే బాగుంటుందని చిరు-కొరటాల బృందం భావించారట. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ మహేష్ వైపు మెగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఫైనల్ గా మహేష్ నే ఒప్పించారని కథనాలు వచ్చాయి. మరి ఈ సినిమాలో మహేష్ బాబు ఎలాంటి పాత్ర చేస్తున్నాడు అనేది ఇంకా క్లారిటీ రాలేదు. నక్సలైట్ పాత్ర అని లీకు అందినా.. మెగాస్టార్ కామ్రేడ్ గెటప్ కి సంబంధించిన లుక్ ఒకటి బయటకు రావడంతో డైలమాలో పడాల్సి వచ్చింది. మరి మహేష్ రోల్ ఎలా ఉంటుంది? అన్నది ఇప్పటికి సస్పెన్స్ గానే ఉంది.

ఈ సినిమా కోసం మహేష్ 30 రోజుల పాటు డేట్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సినిమాలో కూడా మహేష్ పాత్ర 30 నుంచి 40 నిమిషాల పాటు ఉంటుందని సమాచారం. అయితే మహేష్ కు 30 రోజులకు ఒక్కొక్క రోజుకు కోటి చొప్పున 30 కోట్ల వరకూ పారితోషకం ఇస్తున్నట్లు తెలుస్తోంది. సో మహేష్ మాములుగానే రెమ్యునరేషన్ తో పాటు లాభాల్లో వాట కానీ.. సినిమా నిర్మాణంలో భాగంగా కానీ ఉంటారు. సో చిరు సినిమాలో అలాంటివి లేవు కాబట్టి డైరెక్ట్ గా 30 కోట్ల వరకు రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -