Saturday, April 20, 2024
- Advertisement -

బిగ్ బాస్ లో హరితేజ ఓటమికి ఐదు కారణాలు ఇవే

- Advertisement -

బిగ్ బాస్ షో మొదలు అయినప్పుడు ఎవరు కూడా.. హరితేజ ఫైనల్ వరకు వస్తుందని ఎవరు కూడా అనుకోలేదు. కాని అందరితో కలుపుగోలుదనం, మాటల్లో చలాకితనం, మ్యెచురీటి, ఎప్పుడు ఉల్లాసంగా ఉండే గుణంతో ప్రేక్షకులని ఆకట్టుకుంది హరితేజ. ఈమే బిగ్ బాస్ లో బుర్ర క్థ చెప్పినదగ్గర నుంచి బాగా పాపులారిటీ సొంతం చేసుకుంది.

నామినేట్ అయినా, అత్యధిక ఓట్లు పొందుతూ, బిగ్ బాస్ ఫినాలేలో తన స్థానాన్ని ఖరారు చేసుకుంది. టాప్ 2 లో హరితేజ ఉండటం ఖాయమని, తను బిగ్ బాస్ టైటిల్ విన్నర్ గా కూడా నిలిచే అవకాశాలున్నాయని అంతా భావించారు. కానీ ఆమెకంటే శివ బాలాజీకి ఎక్కువ ఓట్లు పడటంతో.. ఆమె గెలువలేకపోయింది. అయితే ఆమె తన సన్నిహితుల వద్ద తాను ఓడిపోవడానికి కారణాలు గురించి చర్చించిందట. అవేంటో ఇప్పుడు చూద్దాం..

* ఆదర్శ్ బిగ్ బాస్ లో టాప్ 2 లోకి రావడానికి కారణం అతడికి ఇంట్లో ఎవరితోనూ గొడవలు లేకపోవడం‌. హరితేజకు క్లీన్ ఇమేజ్ ఉన్నప్పటికి.. దీక్షతో గొడవలు ఆమె ఇమేజ్ ను దెబ్బతీసాయట.

* దీక్షను టార్గేట్ చేసి, అర్చనతో కలిసి దీక్షపై చాడీలు చెప్పుకుంటూ చాలా పెద్ద తప్పు చేసింది హరితేజ. దాంతో అప్పటిదాకా అమెకు బాగా సపోర్ట్ గా నిలిచిన మేల్ ఆడియెన్స్, ఆమెపై నెగెటివ్ ఇంప్రెషన్ పెంచుకున్నారు.

* కేవలం వినోదం అందిస్తేనే ప్రజలు సపోర్ట్ చేయరు. సెన్సిబుల్ ఇమేజ్ చాలా ముఖ్యం. కేవలం వినోదమే పనిచేసుంటే, హరితేజతో పాటు నవదీప్ .. ఈ ఇద్దరే టాప్ 2 లో ఉండాలి.

* ఓ వ్యక్తి చివరికి ఏం చేసాడు అనేదే మనం ఎక్కువగా గుర్తుపెట్టుకుంటాం. కోపిష్టి గా బిగ్ బాస్ లో తన ఆట మొదలుపెట్టిన శివబాలాజీ, క్రమంగా మారుతూ ప్రేక్షకుల మెప్పు పొందాడు. శివ బాలాజీ నెగెటివ్ నుంచి పాజిటివ్ గా మారితే, హరితేజ పాజిటివ్ నుంచి నెగేటివ్ గా మారింది.

* అసలు శివ బాలాజి ఇమేజ్ లో మార్పుకి కారణం కూడా హరితేజనే. తనతో చనువు వలనే, శివబాలాజీ కోపిష్టి నుంచి సరదా మనిషిగా మారాడు‌‌. అది బాగా ప్లస్ అయ్యింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -