Friday, April 26, 2024
- Advertisement -

పెళ్లైన హీరోతోనే పెళ్లికి రెడీ అయిన హీరోయిన్..?

- Advertisement -

టెన్త్ క్లాస్ సినిమాతో ఆరేళ్ల కిందట తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది హీరోయిన్ సునైన. తర్వాత ఆమెకు ఎక్కువ ఛాన్సులు రాలేదు. దాంతో తమిళంలోకి వెళ్లి అక్కడ చాన్సులు బానే వచ్చినప్పటికి పేరు మాత్రం రాలేదు. ఈలోపే అక్కడున్న ఓ యంగ్ హీరోతో ప్రేమలో పడింది. అయితే ఆ హీరోకి గతంలోనే పెళ్లైంది. తర్వాత భార్యకు విడాకులు ఇచ్చి సింగిల్ గా ఉంటున్నాడు. ఇప్పుడూ సునైన అతని ప్రేమలో పడింది.

దీంతో ఇద్దరిపై అనేక రకాల రూమర్లు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ వార్తలకు చెక్ పెట్టే పనిలో పడ్డారు వీరిద్దరూ. సునైన ప్రేమించింది ఎవరో కాదు తమిళ హీరో కృష్ణ కులశేకరన్. పంజా దర్శకుడైన విష్ణువర్ధన్ సోదరుడు. 2016లో మొదటి భార్యతో విడాకులు తీసుకున్న కొన్నాళ్లకు కృష్ణ సునైనాతో ప్రేమయాణం నడిపాడు. సునైనా లవ్ లో ఉన్నట్లు వార్తలు వస్తుండటంతో ఇంట్లో వాళ్లు అభ్యంతరం వ్యక్తంచేశారు. అతడు హీరో కావొచ్చు.

కానీ పెళ్లి అయ్యి విడాకులు తీసుకున్న వ్యక్తి కావడం వారికి నచ్చలేదు. రెండో పెళ్లివాడితో ప్రేమ ఏంటని నిలదీశారు. దీంతో సునైన కుటుంబసభ్యులకు నచ్చచెప్పింది. అందుకే సునైనా – కృష్ణ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇంట్లోవాళ్లను ఒప్పించి పెళ్లికి సిద్ధమైనట్లు సమాచారం. లాక్ డౌన్ అయిపోగానే పెళ్లిపీఠలెక్కనున్నారట. ప్రస్తుతం సునైన.. శ్రీ విష్ణుతో ‘రాజా రాజా చోళ’ అనే సినిమాలో నటిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -