ఒక్క చాన్స్ అంటున్నా రాజశేఖర్…

501
Actor Rajasekhar searching for Heroin
Actor Rajasekhar searching for Heroin

సీనియర్ హీరోలకు ఎప్పుడు ఉండే సమస్య ఏంటంటే హీరోయిన్ లు దొరక్కపోవడం.. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి సీనియర్ హీరోలకు ఇది పెద్ద సమస్య మారిపోగా వీరి జాబితాలోకి రాజశేఖర్ కూడా చేరిపోయాడు.. తన రీ ఎంట్రీ లో రాజకేశేఖర్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు అని చెప్పాలి.. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో గరుడవేగ సినిమా చేసి సూపర్ హిట్ అందుకున్న రాజశేఖర్ ఆ టైం లో అయన చేసినా హడావుడి అంతా ఇంతా కాదు.. సినిమా సూపర్ హిట్ కావడంతో ఎన్నో ఏళ్ల దాహం ఆయన తీర్చుకున్నట్లు అయ్యింది..

అందుకే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కల్కి సినిమా చేసి చేతులు కాల్చుకున్నాడు..గరుడ వేగా హిట్ తో ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ఒక్కసారిగా పరాజయం పాలైంది.. ఆ లాంటి వెరైటీ సినిమా చేసిన ప్రశాంత్ ఇలాంటి సినిమా చేయడమేంటి అని దర్శకుడిని విమర్శించారు కూడా.. హీరో కి తగ్గట్లు కథ రాసి కథను నాశనం చేశారని విమర్శలు చాలా వచ్చాయి.. డైరెక్షన్ కి మంచి పేరు వచ్చినా సినిమా మాత్రం రొట్ట అని పేరు తెచ్చుకుంది..

దాంతో కొంత గ్యాప్ తీసుకుని మరీ రాజశేఖర్ నీలకంఠ దర్శకత్వంలో ఓ త్రిల్లర్ సినిమా చేయడానికి సిద్ధమయ్యారు.. ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం చాలామందిని ట్రై చేశారట. మీడియం రేంజ్ హీరోయిన్లు కూడా ఎవ్వరూ ముందుకు రాలేదట. దాంతో ఒకరకంగా హీరోయిన్ పాత్ర లేకుండానే ముందుకు వెల్దామనుకున్నారు.. కానీ కథ కి హీరోయిన్ తప్పని సరి కావడంతో మళ్ళీ వెతుకులాట ప్రారంభించారట.. అసలే రాజశేఖర్, పైగా ఫాంలో లేని నీలకంఠ దర్శకుడు కావడంతో కాస్త పేరున్న హీరోయిన్లెవరూ ఆసక్తి చూపించలేదట. చివరికి అప్పుడెప్పుడో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన ‘యముడికి మొగుడు’లో కథానాయికగా నటించిన రిచా పనాయ్‌ను తీసుకున్నారట.  మరి ఈ ముద్దుగుమ్మ కి ఈ సినిమా ఎంతవరకు హెల్ప్ అవుతుందో చూద్దాం..

Loading...