Thursday, March 28, 2024
- Advertisement -

ఓ బేబీ టీమ్ కి షాకిస్తున్న రాజేంద్ర ప్రసాద్

- Advertisement -

సమంత ప్రధాన పాత్ర లో ఈ శుక్రవారం నాడు థియేటర్ల లో విడుదల కానున్న సినిమా ఓ బేబీ. నందిని రెడ్డి దర్శకత్వం లో ఈ సినిమా రానుంది. ఇందులో చాలా మంది పేరున్న నటీ నటులు పని చేస్తున్నారు. 70 ఏళ్ళ లక్ష్మి ఆత్మ ఒక రోజు సడన్ గా 25 ఏళ్ళ సమంత శరీరం లో ప్రవేశిస్తే ఏం జరుగుతుంది అనేది సినిమా కథ. ఇందులో సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. అయితే ఆసక్తికరమైన అంశం ఏంటి అంటే ఆయన సినిమా ప్రమోషన్స్ లో ఎక్కువ గా కనపడుతున్నారు. సాధారణం గా క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ ప్రమోషన్స్ లో ఎక్కువగా కన్పించరు కానీ ఎందుకో ఈ సినిమా విషయం లో మాత్రం రాజేంద్ర ప్రసాద్ ఎక్కువగా కనిపిస్తున్నారు.

అయితే ఆయన ఈ సినిమా లో చంటి అనే పాత్ర పోషిస్తున్నారు. అటు లక్ష్మి తో, ఇటు సమంత తో, ఇద్దరి తో మంచి సీన్లు పడటం తో ఆయన ఇక ప్రమోషన్స్ లో రెచ్చిపోతున్నారు. ఆద్యంతం తన గురించే, తన పాత్ర గురించి గొప్పలు చెప్పుకుంటూ సొంత డబ్బా కొట్టుకుంటున్నారు కానీ సినిమా గురించి, సమంత పాత్ర గురించి మాత్రం పెద్దగా చెప్పడం లేదు. ఎంత సీనియర్ నటుడు అయినా రాజేంద్ర ప్రసాద్ ఇప్పుడు ప్రత్యేకం గా తన గురించి చెప్పాల్సింది ఏమి లేదు, అందరికీ తానేంటో తెలిసినప్పుడు ఆయన ఎందుకు ఇలా అటెన్షన్ కోరుకుంటున్నారో మాత్రం తెలియడం లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -