స్టార్ హీరోయిన్స్ కే షాక్ ఇస్తున్న అమీషా పటేల్.. చూస్తే షాక్..!

806
actress ameesha patel stunning photoshoot
actress ameesha patel stunning photoshoot

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన ‘బద్రి’ చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది అమీషా పటేల్. ఈ సినిమాతో ఈమె తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది. ఇది ఈమెకు ఓవరాల్ గా రెండో చిత్రం. అంతకముందు హిందీలో హ్రితిక్ రోషన్ హీరోగా నటించిన ’కహోనా ప్యార్ హై’ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఇది పక్కన పెడితే.. బద్రి సినిమా కూడా సూపర్ హిట్ అయింది.

ఈ సినిమా హిట్ అయినప్పతికి మళ్లీ ఈమె తెలుగులో సినిమాలో చేయడానికి 4 ఏళ్ళు పట్టింది. 2004 లో మహేష్ బాబు హీరోగా వచ్చిన ‘నాని’ చిత్రంతో మళ్ళీ తెలుగు ప్రేక్షకులను పలకరించింది. కానీ ఆ చిత్రం హిట్ అవ్వలేదు. అటు తరువాత ఎన్టీఆర్ తో చేసిన ‘నరసింహుడు’ , బాలకృష్ణ తో చేసిన ‘పరమ వీర చక్ర’ సినిమాలు కూడా పెద్ద డిజాస్టర్లు అయ్యాయి. దీంతో ఆమెకు తెలుగులో అవకాశాలు రాలేదు. అయితే ‘ఆకతాయి’ అనే చిత్రంలో మాత్రం గెస్ట్ రోల్ లో కనిపించింది. ఇదిలా ఉండగా.. హిందీలో కూడా ఈమెకు అవకాశాలు లేవు.

ఈమె నటించిన రెండు లేటెస్ట్ సినిమాలు.. ఇంకా విడుదల కాలేదు. ‘దేశి మ్యాజిక్’ అలాగే ‘ది గ్రేట్ ఇండియన్ క్యాసినో’ అనే చిత్రాలు ఇంకా రిలీజ్ కావాల్సి ఉంది. అయితే ఈమెకు ఆఫర్స్ ఎక్కువగా రావడం లేదని.. అందరి హీరోయిన్స్ లానే సోషల్ మీడియాను నమ్ముకుంది. ఇటీవలే బెడ్ పై ఈమె ఇచ్చిన రొమాంటిక్ ఫోజులు యమ హాట్ గా ఉన్నాయి. 44 ఏళ్ళ వయసులో కూడా కుర్ర హీరోయిన్లను మించి గ్లామర్ మైంటైన్ చేస్తూ కుర్ర కారుకు పిచ్చేక్కిస్తోంది. మీరుకు ఆ ఫోటోలను ఓ లుక్కెయండి.

Loading...