Friday, March 29, 2024
- Advertisement -

ఆ జంతువులను చంపి నేను జైలుకు వెళ్తా : పూనమ్ కౌర్

- Advertisement -

వెటర్నరీ వైద్యురాలి ప్రియాంకరెడ్డి హత్యపై స్పందించారు నటి పూనమ్ కౌర్. నిందితులను తానే చంపి జైలుకి వెళ్తానంటూ కన్నీరు పెట్టుకున్నారు. ఇలాంటి సమాజంలో ఉండటం కంటే అడువుల్లో ఉండటం బేటర్ అని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాలి తల్లి పోలీసుల ఆశ్రయించినప్పుడు ఎవరితోనైనా లేచిపోయిందేమో అని అనడనికి ఆ పోలీసు అధికారికి సిగ్గులేదా ? అని ఫైర్ అయింది.

ఓ మహిళ సాయం కోసం నడి రోడ్డుపై ఎదురుచూస్తుంటే ఆ నలుగురు ల***లు ఆమెకు మాయమాటలు చెప్పి ఎత్తుకెళ్లి రేప్ చేసి నిప్పు అంటించి చంపారు. ఇంకెన్నాళ్లు పోలీసులు, ప్రభుత్వం చర్యలు తీసుకునేవరకు ఎదురు చూస్తూ ఉండాలి. ఆ జంతువులను చంపి జైలుకి వెళ్లాలని ఉంది. వారు జైలు శిక్ష అనుభవిచడం కాదు.. కావాలంటే నేనే వారిని చంపి జైలుకి వెళ్తా.. దేశంలో జరిగే ఈ రేప్ లకు అరికట్టాలంటే పరిష్కారం ఏంటి ? అంటూ ఉద్వేగానికి లోనయ్యారు పూనమ్. ఇది ఇలా ఉండగా.. హీరోయిన్ నిధి అగర్వాల్ సోషల్ మీడియాలో తనకు సంబంధించిన హాట్ ఫోటోలను పోస్ట్ చేసింది.

ఆ ఫోటలపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. ’నీలాంటి వారి వల్లే సామాన్య మహిళలపై రేపులు జరుగుతున్నాయి” అని అన్నాడు. అందుకు నిధికి కోపం వచ్చింది. ‘ఇలాంటి దరిద్రమైన ఆలోచనా ఉన్న వ్యక్తిని చూసి షాకింగ్‌గా ఉంది. నరేష్.. దయచేసి మీ ఇంటి అడ్రెస్ పంపు. ‘పింక్’ అనే సినిమా ఒకటి ఉంది. ఆ సినిమా సీడీ నీకు పంపుతాను. ఆ సినిమా నువ్వు చూడటం చాలా అవసరం’ అని తనదైన శైలిలో ఘాటుగా జవాబు ఇచ్చింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -