బిగ్‌బాస్‌లోకి ఎందుకు వెళ్తారో చెప్పిన ప్రగతి ఆంటీ..!

2099
actress pragathi clarity on entry into bigg boss 4 telugu
actress pragathi clarity on entry into bigg boss 4 telugu

బిగ్ బాస్ షోకి తెలుగులో ఎలాంటి క్రేజ్ ఉందో అందరికి తెలిసిందే. ఇక నాల్గో సీజన్ ప్రారంభించేందుకు యాజమాన్యం రెడీ అవుతోంది. ఇప్పటికే అధికారికంగా ఓ ప్రకటన కూడా వచ్చింది. ఈ సారి నాలుగో సీజన్ కు కూడా నాగార్జునే హోస్ట్ గా వ్యవహరించనున్నారు. ఈ మధ్యే షూటింగ్‌లో పాల్గొన్నట్టు నాగార్జున కొన్ని స్టిల్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

ఇప్పటికే కంటెస్టెంట్లను కూడా సెలెక్ట్ చేసి క్వారంటైన్‌లో ఉంచినట్టు తెలుస్తోంది. అయితే బిగ్ బాస్ లో పాల్గొనే నాలుగో సీజన్ కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే అని ఓ లిస్ట్ వైరల్ అవుతోంది. సింగర్ సునీత, హేమచంద్ర, వైవా హర్ష, హంసా నందిని, యామినీ భాస్కర్, నందు, అఖిల్ సార్ధిక్, మంగ్లీ, జబర్దస్త్ నరేష్, ప్రగతి,తరుణ్, శ్రద్దా దాస్ వంటి వారున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో తరుణ్, శ్రద్దా దాస్ మాత్రం ఈ వార్తలను ఖండించారు. అయితే ఈ రియల్టీ షోలపై నటి ప్రగతి తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే నాల్గో సీజన్ కంటెస్టెంట్లలో తన పేరు ప్రచారం కావడంపై ప్రగతి స్పందించింది.

బిగ్ బాస్ షోలోకి వెళ్లాలంటే రెండు కారణాలుంటాయని, ఒకటి పేరు తెచ్చుకోవడానికి, రెండోది ఉన్న పేరును మార్చుకోవడానికి అని తెలిపింది. అసలు ఎలాంటి ఫేమ్, నేమ్ లేకపోతే అందులోకి వెళ్లి క్రేజ్ తెచ్చుకోవచ్చు లేదా తమ మీద చెడు అభిప్రాయాన్ని చెరిపేసి, తానేంటో నిరూపించుకుని కొత్తగా ఆవిష్కరించుకోవడానికే వెళ్తారని పేర్కొంది. అయితే ఈ రెండు తనకు అవసరం లేదని తెలిపింది. తనకు ఫేమ్ ఉందని, అది కూడా అందరి దృష్టిలో మంచి పేరే ఉందని అలాంటప్పుడు తనకు బిగ్ బాస్‌కు వెళ్లాల్సిన అవసరం ఏముందని, రూమర్లను ఖండించింది.

మోహన్ బాబు ఇంటికి వెళ్లి మరి బెదిరించిన దుండగులు..!

నిజం సినిమాలో నన్ను మోసం చేసి ఆ సీన్స్ తీశారు : రాశీ

నా భర్త పెద్ద సైకో.. నన్ను టార్చర్ పెడుతున్నాడు : స్వాతి నాయుడు

‘పవర్ స్టార్’ సినిమా వల్ల వర్మకి ఎంత లాభామో తెలుసా ?

Loading...