Thursday, March 28, 2024
- Advertisement -

రానా ప్రేమ, పెళ్లిపై శ్రీరెడ్డి ఏమన్నాదంటే ?

- Advertisement -

లాడ్ డౌన్ వేళ పెళ్లి వాయిదాలు వేసుకున్నారు కొందరు హీరోలు. అయితే ఈ కరోనా వైరస్ ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి కారణంగా వాయిదా వేసుకున్న పెళ్లిలను అతి కొద్ది మంది సమక్షంలో తాజాగా పెళ్లి చేసుకుంటున్నారు. టాలీవుడ్‌లో దిల్ రాజు, నిఖిల్‌, జబర్దస్త్ మహేష్‌లు పెళ్లి పీటలు ఎక్కేసి అరుంధతి నక్షత్రం కూడా చూసేశారు.

ఇక రెండు రోజులుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ రానా ప్రేమ వ్యవహారం. తన ప్రేయసిని పరిచయం చేస్తూ.. పెళ్లికి ఆమె ఓకే చెప్పేసింది అంటూ ఇద్దరూ కలిసి ఉన్న పొటోను సోషల్ మీడియాలో వదిలారు రానా. త్వరలో వీరి పెళ్లి జరగనుంది. హైదరాబాద్‌కి చెందిన ప్రముఖ ఇంటీరియల్ డిజైనర్ మిహికా బజాజ్‌ను త్వరలో వివాహ మాడనున్నారు రానా. కాగా ఆయనకు శుభాకాంక్షల్ని తెలియజేస్తూ టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలు ట్వీట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంపై రానా పెళ్లిపై స్పందిస్తూ ఆసక్తికరమైన పోస్ట్ చేశారు వివాదాస్పద నటి శ్రీరెడ్డి.

రానా ఫ్యామిలీకి శ్రీరెడ్డికి పాత గొడవలు.. అవే రానా తమ్ముడు దగ్గుబాటి అభిరామ్‌లో రాసలీలలు సాగిస్తూ ఆ ఫొటోలను తన ఫేస్ బుక్‌లో పెట్టి దగ్గుబాటి ఫ్యామిలీ పరువును బజారుకి లాగిన శ్రీరెడ్డి.. సమయం వచ్చిన ప్రతిసారీ రానా, సురేష్ బాబు, వెంకటేష్‌లను వరసలు పెట్టి పిలుస్తూ వివాదాస్పద పోస్ట్‌లను షేర్ చేస్తుండేది. అయితే రానా పెళ్లి పై శ్రీరెడ్డి స్పందిస్తూ.. రానాకి విషెష్ అందించింది. “మీరు ఎంతవరకూ వెళ్లారో నాకు తెలుసు రానా గారూ.. ఆ అమ్మాయితో మీకు ప్రశాంతమైన జీవితం లభించేలా దేవుడు దీవిస్తాడు’ అంటూ ఫేస్ బుక్‌లో పోస్ట్ పెట్టింది శ్రీరెడ్డి. దాంతో శ్రీరెడ్డి ఏదో ఒకటి కౌంటర్ ఇస్తుంది కదా.. ఇంత మంచిగా ఎలా మారిపోయింది అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -