హైపర్ ఆదిని టార్గెట్ చేసిన సద్దాం.. ఊహించని పంచ్..!

1091
Adirindi Saddam Punches Jabardasth Hyper Aadi Again
Adirindi Saddam Punches Jabardasth Hyper Aadi Again

హైపర్ ఆది జబర్దస్త్ కమెడీయన్.. సద్దాం అదిరింది షో కమెడీయన్. గతంలో కూడా ఆదిని టార్గెట్ చేసి సద్దాం ఇన్ డైరెక్ట్ పంచ్ లు వేశాడు. ఈ విషయంపై ఆది గతంలో స్పందిస్తూ.. నా స్కిట్స్ మిలియన్స్ లో వ్యూవ్స్ ఉన్నాయి. గత కొన్నెళ్ళుగా జబర్దస్త్ లో నా ఫాలోయింగ్ అలానే ఉంది. ఇప్పుడు వచ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదని చెప్పాడు.

ఇంతకీ అప్పట్లో సద్దాం చేసిన పొరపాటు ఏంటంటే.. స్కిట్‌లో భాగంగా ఓ సందర్భంలో గల్లీ బాయ్స్ టీమ్‌మేట్ భాస్కర్.. ”అది కాదురా..” అని సద్దాంతో అంటాడు. వెంటనే అందుకున్న సద్దాం.. ”ఆది కాకుంటే… సద్దాం. ట్రెండింగ్‌లో ఉంటుంది.” అని ఇన్ డైరెక్ట్‌గా ఆదిపై పంచ్ వేశాడు. అయితే దీనికే ఓ రేంజ్‌లో రియాక్ట్ అయ్యి తనను తాను బుల్లితెర బాహుబలిగా అభివర్ణించుకున్న ఆదిని మరోసారి టార్గెట్ చేశాడు సద్దాం.

తాజాగా వచ్చేవారానికి సంబంధించిన ప్రోమోను విడుదల చేయగా సద్దాం ఎప్పటిలాగే ఊర మాస్ స్కిట్ చేశాడు. తన టీం మేట్‌పై కాలువేసుకుని పడుకుంటాడు.. అరేయ్ కాళ్లు తీయరా అంటే.. ఒకకాలు మాత్రమే తీస్తాడు.. రెండో కాలు మా అమ్మ మొగుడు తీస్తాడా అంటే.. అంకుల్ వచ్చినావా?? ఆంటీ కూడా వచ్చినావా? అంటూ పంచ్ వేశాడు. దీంతో ‘రేయ్!! అది కాదు అని’ అనడంతో.. ‘ఆది’ కాకపోతే.. అంటూ గొంతుచించుకుని అరిశాడు.. ఆది కాకపోతే ఏంది.. చెప్పరా?? అని మళ్లీ రివర్స్‌లో అడగ్గా.. ‘ఆది కాకపోతే సోమ’రా అంటూ పంచ్ వేశాడు. మొత్తానికి ఆది ప్రస్తావన తీసుకువస్తూ మరోసారి తన స్కిట్‌లో పంచ్‌లు వేశాడు సద్దాం.

నయనతార ప్రమోషన్స్ కి దూరంగా ఉండటానికి కారణం ఇదే..!

పవన్ బర్త్ డే ‘వకీల్ సాబ్’ సర్ ఫ్రైజ్ గిఫ్ట్ ఇదే..!

వర్మ ’పవర్ స్టార్’మూవీపై పవన్ కళ్యాణ్ రియాక్షన్..!

షూటింగ్‌లు చేయం అంటున్న సుమ, అనసూయ.. ఎందుకు ?

Loading...