Thursday, March 28, 2024
- Advertisement -

RRRలో ఈ ముగ్గురికే 100 కోట్లు ఇచ్చారట..!

- Advertisement -

రాజమౌళి ప్రస్తుతం తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్. భారీ పాన్ ఇండియా సినిమాగా ఇది తెరకెక్కుతుంది. జులై 2020 లో ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు యూనిట్ ప్లాన్ చేస్తోంది. అయితే ఈ దసరకు ఆర్ ఆర్ ఆర్ నుంచి ఫస్ట్ లుక్ అన్న రిలీజ్ అవుతుందని ఫ్యాన్స్ ఎదురు చూశారు. కానీ ఎలాంటి అప్ డేట్ రాలేదు. దీపావళికి కూడా అప్ డేట్ వచ్చేలా లేదు.

ఆర్ ఆర్ ఆర్ సంబంధించి టైటిల్.. రామ రౌద్ర రుషితం అనే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతుంది. ఇక రాజమౌళికి, ఆర్ ఆర్ ఆర్ హీరోలకు ఎంత పారితోషకం ముడుతుందో అంటూ చర్చ సాగుతోంది. ఈ సినిమా కోసం చరణ్, ఎన్టీఆర్ లకు 40 కోట్లు అందితుందని ప్రచారం సాగుతుంది. వీళ్లకంటే ఎక్కువగా బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అజయ్ రోల్ ఆర్ ఆర్ ఆర్ లో చాలా కీలకమైనది. అందుకే ఆయనకు ఏకంగా 35కోట్ల పారితోషకం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. పారితోషకం దగ్గటే ఆయన పాత్ర సినిమాలో ఉంటుందట.

ఈ వివరాల్ని బట్టి కేవలం ముగ్గురు ప్రధాన స్టార్లకు ఇచ్చే పారితోషికాలే 100 కోట్లు.. ఇక రాజమౌళి ప్యాకేజీ యెంత ఉంటుందో చెప్పాల్సిన పనేలేదు. దాదాపు 350కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామని నిర్మాతలే క్లూ ఇస్తున్న విషయం తెలిసిందే. దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా లో ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో.. చరణ్ అల్లూరి సీతారామారాజుగా కనిపించనున్నారు. ప్రస్తుతం హైదరబాద్ లో షూటింగ్ జరుగుతుంది. త్వరలోనే టైటిల్ ను ప్రకటించనున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -