హౌస్ లో కొట్టుకున్న అలీ మరియు బాబా మాస్టర్..!

4874
ali reza and baba bhaskar fight in finale ticket task goes violent
ali reza and baba bhaskar fight in finale ticket task goes violent

బిగ్ బాస్ చివరి దశలో ఉండటంతో ఫైనల్ కు టిక్కెట్టు కూడా ప్రకటించేశాడు బిగ్ బాస్. దాంతో డైరెక్ట్ గా ఫైనల్ కు వెళ్లేందుకు ఎలాంటి టాస్క్ ఇచ్చిన చేసేందుకు రెడీ అవుతున్నారు హౌస్ మేట్స్. ఫైనల్ టిక్కెట్ గెలిచిన వారు తప్ప మిగిత సభ్యులందరు నామినేషన్ లో ఉంటారని బిగ్ బాస్ చెప్పాడు. టాస్క్ లను బానే లాకొస్తున్నాడు ఇంటి సభ్యుడు అలీ.

అంతేకాకుండా అదృష్టం కూడా అతని వెంటే ఉన్నట్లు కనిపిస్తోంది. కలర్ బాక్స్ లను సెలెక్ట్ చేసుకోవడం.. అందులో 70శాతం రావడం.. శివజ్యోతితో తిండిలో పోటీ పడటం.. ఇలా అన్నీ కలిసి వచ్చి అలీ టాప్ లో ఉన్నాడు. అయితే మొదటి లెవల్ లో ఈజీ టాస్క్ లు ఇచ్చినప్పటికి రెండో లెవల్లో మాత్రం దుమ్ములేపినట్లు తెలుస్తోంది. చివరి వరకు వచ్చిందని హౌస్ మెట్స్ కూడా రెచ్చిపోయి విజృంభిస్తున్నారు. రెండో అంకంలో బాబా, అలీకి పోటీ పడ్డట్లు కనిపిస్టోంది.

ఇక ఈ టాస్క్ లో భాగంగా.. ఒకే తొట్టిలో ఇద్దరూ ఉండి.. వారికి సంబంధించిన పూల మొక్కను నాటాల్సి ఉంటుందని టాస్క్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా వీరిద్దరి మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో బాబాను అలీ ఒక్క తోపు తోయడంతో బాబా ఎగిరి అవతల పడ్డాడు. దాంతో శ్రీముఖి, శివజ్యోతి భయపడ్డారు.

Loading...