అలీ వచ్చి లీక్ చేసిన విషయాలు ఏంటో తెలుసా ?

3573
Ali Reza Reveal all Secrets to BiggBoss Housemates
Ali Reza Reveal all Secrets to BiggBoss Housemates

అలీ రెజా బిగ్ బాస్ లోనే రెండు గొప్ప ఛాన్సులు కొట్టేసిన లక్కీ బాయ్. నార్మల్ కంటెస్టెంట్ గా వెళ్ళడం ఒక ఎత్తు అయితే ఎలిమినెట్ అయిపోయి వైల్డ్ కార్డుగా ఛాన్స్ వచ్చి వెళ్ళడం మరో ఎత్తు. అలీ పేరు టాప్ 5 లో వినపడేది కానీ అతని కోపం వల్ల మధ్యలోనే వెళ్ళిపోవాల్సి వచ్చింది… కానీ రెండోసారి తిరిగి రావడం మాత్రం మంచి ఛాన్స్ అని చెప్పుకోవచ్చు.

అలీ రీఎంట్రీకి సంబంధించిన పాట మొదలు అవ్వగానే ఇంట్లో ఆనందం మామూలుగా పెరిగిపోలేదు. శ్రీముఖి, శివ జ్యోతి, రవిలను ఆపడం ఎవరి తరం కాలేదు. అరుపులు కేకలతో ఇల్లంతా ఊగిపోయింది. అలీ వచ్చీ రాగానే శ్రీముఖిని, జ్యోతీని ఎత్తుకోవడం లాంటివి చేసాడు. ఇన్ని రోజులు బిగ్ బాస్ ను ఇంట బయట ఫాలో అయిన అలీ రెజాకు ఇప్పుడు ఆట చాలా తేలిక. ఎవరు ఎలా దేనికి రియాక్ట్ అవుతారో తెలుసుకున్నాడు కాబట్టి గేమ్ మంచి వ్యూహాలతో ఆడటానికి ఛాన్స్ ఉంటుంది. కానీ అలీ రెజాకి అదే మైనస్ అవుతుంది కూడా.

ఇక ముఖ్యమైన విషయానికి వస్తే అలీ ఇంట్లోకి రాగానే శివ జ్యోతి ఏడుపు గురించి మాట్లాడుతూ మీమ్స్ గురించి చెప్పాడు. శివ జ్యోతి అంత ఏడుస్తుంటే “అమ్మా నేను సచ్చిపోలేదు, ఇంటికి పోయే అంతే ” అని పెట్టారు అని చెప్పాడు… నిన్నటి ఎపిసోడ్ లో అక్కడి వరకే చూపించారు. కానీ అలీ రెజా కు బిగ్ బాస్ నిర్వాహకులు ఎలాంటి నియమాలు పెట్టలేదని, అలీ రెజా ఇంట్లో ఏది చెప్పినా పర్లేదు అని బయట నడుస్తున్న టాక్. అందరికీ అన్ని విషయాలు తెలిస్తే ఆట ఎలా ఆడతారు అనేది మనం మునుముందు చూడబోతున్నాం అనేది వినికిడి.

Loading...