బిగ్ బాస్ 4 రెడీ అవుతుంది.. పాల్గొనేది వీరే..?

956
All Set For Most Awaited Reality Game Show
All Set For Most Awaited Reality Game Show

బిగ్ బాస్ కు ఉన్న క్రేజ్ మరో షోకి లేదనే చెప్పాలి. ఇప్పటికే తెలుగులో బిగ్ బాస్ మూడూ సీజన్లు కంప్లీట్ చేసుకుంది. మాములు క్రేజ్ ఉన్న వారు కూడా ఈ బిగ్ బాస్ వల్ల సెలబ్రిటీలుగా మారిపోయారు. బోలెడు పాపులారిటీ సంపాదించారు. ప్రముఖ చానెల్ లో ప్రసారమయ్యే ఈ షో వాస్తవానికి జూన్ లో ప్రారంభం కావాల్సి ఉండేది.

కానీ ప్రస్తుత మహమ్మారి-లాక్ డౌన్ కారణంగా బిగ్ బాస్ వాయిదా పడింది. షూటింగ్ లకు అనుమతిస్తే కానీ బిగ్ బాస్ మొదలయ్యే తేదీపై క్లారిటీ రానుంది. అయితే ఈ సారి లేట్ గానే బిగ్ బాస్ ను మొదలు పెట్టేందుకు యాజమాన్యం చూస్తోందట. ఇప్పటికే బిగ్ బాస్ కంటెస్టెంట్ల ఎంపిక జరిగిందని టాక్ వినిపిస్తోంది. బిగ్ బాస్ సీజన్ 4 పాల్గొనే సభ్యులను ఎంపిక చేయడానికి నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. ఇప్పటివరకు పలువురిని బిగ్ బాస్ టీం సంప్రదించారని వార్తలు వస్తున్నాయి.

అందులో హీరో తరుణ్, యాంకర్ శివ, జాహ్నవి, సింగర్ మంగ్లీ, వర్షిణీ, అఖిల్ శ్రతక్ లను సంప్రదించారని తెలిసింది. ఇక బిగ్ బాస్ మూడోస్ ఈజన్ కు హోస్ట్ గా దుమ్ము రేపిన అక్కినేని నాగార్జునే ఈ నాలుగో సీజన్ కి కూడా హోస్ట్ గా వ్యవహరించనున్నారట. ప్రస్తుతం వైరస్ ప్రభావం ఉంది కాబట్టి త్వరలో ఈ షో ప్రారంభం క్లారిటీ రానుంది.

Loading...