Saturday, April 20, 2024
- Advertisement -

బాలకృష్ణ పాత్రలో అల్లు అర్జున్.. !

- Advertisement -

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం అల వైకుంఠపురములో. ఈ సినిమా రేపే ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని చిత్ర యూనిట్ పాజిటివ్ గా ఉంది.

ఇక ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో అల్లు అర్జున్ పాత్రపై అనేక వార్తలు సోషల్ మీడియాలో షికారు చేస్తున్నాయి. ఈ సినిమాలో బన్నీ స్మగ్లింగ్ చేస్తూ కనిపిస్తాడని వార్త హల్ చల్ చేస్తోంది. అయితే తాజాగా అల్లు అర్జున్ ఈ మూవీలో లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తాడని, ఆయన చాలా రఫ్ పాత్రలో పోషిస్తున్నాడని తెలుస్తోంది.

గతంలో లారీ డ్రైవర్ అనే సినిమాలో బాలయ్య అదరగొట్టిన విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రంలో అల్లు అర్జున్ లుక్ ఎలా ఉండబోతుందో అనేది ప్రేక్షకుల్లో ఆసక్తిగా మారింది. అల వైకుంఠపురములో సినిమాలో క్లాస్ లుక్‌తో అదరగొట్టేందుకు రెడీ అయిన బన్నీ సుకుమార్ సినిమాలో రఫ్ లుక్‌లో ఎలా మెప్పిస్తాడో చూడాలి అంటున్నారు సినీ ప్రేక్షకులు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్స్ ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -