Thursday, April 25, 2024
- Advertisement -

‘టాక్సీవాలా’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు బ‌న్నీ..?

- Advertisement -

విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన టాక్సీవాలా సినిమా ఈ నెల 17న విడుద‌ల కానుంది.ఎప్పుడో విడుద‌ల కావ‌ల్సిన ఈ సినిమా వాయిదాల మీద వాయిదాలు ప‌డుతు ఇప్పుడు విడుద‌ల‌కు రెడీ అయింది.సైంటిఫిక్ సస్పెన్స్ థ్రిల్లర్ గా నిర్మితమైన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 11వ తేదీన ఘనంగా నిర్వహించనున్నారు. గీతా ఆర్ట్స్ 2 .. యూవీ క్రియేషన్స్ వారు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ వేడుకకి ముఖ్య అతిథిగా అల్లు అర్జున్ రానున్నాడని స‌మాచారం.

గతంలో కూడా విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమాకు ముఖ్య అతిథిగా వ‌చ్చాడు అల్లు అర్జున్‌.గీతా గోవిందం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా వ‌చ్చాడు బ‌న్నీ.ఈ సినిమా సూప‌ర్ హిట్ కావ‌డంతో టాక్సీవాలా ప్రీ రిలీజ్‌కు కూడా బ‌న్నీ వ‌స్తే ఈ సినిమా కూడా సూప‌ర్ హిట్ అవుతుంద‌ని విజ‌య్ అభిమానులు భావిస్తున్నారు.అయితే అల్లు అర్జున్ ఈ ఫంక్ష‌న్‌కు వ‌చ్చేది లేనిది తెలియాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -