చిరంజీవి లెక్కచేయని అల్లు అర్జున్..!

695
Allu Arjun Doesnt Case Chiranjeevi
Allu Arjun Doesnt Case Chiranjeevi

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే అల వైకుంఠపురములో సినిమాతో హిట్ కొట్టాడు. తర్వాత సుకుమార్ డైరెక్షన్ ఓ సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు. అయితే కరోనా కారణంగా అల్లు అర్జున్ ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నాడు. షూటింగ్స్ లేకపోవడంతో కుటుంబ సభ్యులతో గడుపుతున్నాడు. ఇది ఇలా ఉంటే తమ కుటుంబానికి చెందిన పెద్ద మెగాస్టార్ చిరంజీవి అంటే బన్నీ ఇష్టమన్న విషయం తెలిసిందే.

తమకి పూల దారి పరిచిన మెగాస్టార్ ను ఒక్క మాట అన్నా కానీ తక్కువ చేసినా తాను ఊర్కోనని అప్పుడప్పుడు అల్లు అర్జున్ అంటూంటాడు. ఎక్కడైనా సరే చిరు కోసం మాట్లాడకుండా ఉండని బన్నీ ఇప్పుడు మెగాస్టార్ విషయంలో ఇంకా మౌనంగా ఉండడం ఆశ్చర్యకరం. మెగాస్టార్ చిరంజీవి ఈరోజే తన మొట్టమొదటి సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ అరంగేట్రం చేశారు. ఇస్టాగ్రామ్ లో ఖాతా ఓపెన్ చేసిన మెగాస్టార్ కు కేవలం గంటల్లోనే లక్షలాది మంది ఫాలోవర్స్ వచ్చేసారు. అలానే ట్వీట్టర్ లో కూడా తన ఖాతా ఓపెన్ చేశాడు.

దీనితో మొత్తం మెగా కుటుంబం అంతా మెగాస్టార్ కు గ్రాండ్ వెల్కమ్ చెపుతూ తమ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఆనందం వ్యక్తం చేసారు. కానీ అల్లు అర్జున్ మాత్రం ఇప్పటివరకు ఒక్క పోస్టు కూడా వేయలేదు. అల్లు అర్జున్ నాన్ బాహుబలి హిట్ కొట్టాడన్న ఊపులో ఎవర్ని పట్టించుకోవడం లేదని అల్లు అర్జున్ యాంటీ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Loading...