Thursday, April 25, 2024
- Advertisement -

అల్లు అర్జునే బెస్ట్ డ్యాన్సర్ : చరణ్ అక్క సుస్మిత

- Advertisement -

టాలీవుడ్ లో బెస్ట్ డాన్సర్ అనే విషయం రాగానే మనకు ముందు గుర్తు వచ్చేది రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్. ఈ ముగ్గిరిలో బెస్ట్ డ్యాన్సర్ ఎవరు అన్నదానిపై అభిమానుల్లో ఎప్పుడు హాట్ టాపిక్ నడుస్తూనే ఉంటుంది. అయితే ఎన్టీఆర్ విషయం పక్కన పెడితే చరణ్, బన్నీ ఇద్దరిలో ఎవరు బెస్ట్ డాన్సర్ అని చరణ్ అక్క సుస్మితను అడిగితే ఏమన్నారో తెలుసా ?

ఏ అక్క అయినా తమ్ముడికే సపోర్ట్ చేస్తుందని అందరం అనుకుంటాం. కానీ సుస్మిత కొణిదెల డిఫరెంటుగా స్పందించి అందరికి షాక్ ఇచ్చింది. ఓ ఇంటర్వ్యూలో సుస్మిత కొణిదెల మాట్లాడుతూ చరణ్ కంటే బన్ని బెస్ట్ డ్యాన్సర్ అని కామెంట్స్ చేసింది. సుస్మిత కామెంట్ కి చరణ్ అభిమానులు ఫీల్ అయ్యారు. అయితే తన తమ్ముడు చరణ్ గురించి అలాగే బన్ని బావ గురించి సుస్మిత తనకు తెలిసిన కొన్ని విషయాల్ని చెప్పుకొచ్చారు. ఇంట్లో చిన్నప్పటి నుంచి ఏ ఫంక్షన్ అయినా బన్ని డ్యాన్సులు చేసేవాడని.. కానీ చరణ్ అలా కాదని కూడా సుస్మిత వెల్లడించారు.

బన్నీనే ఇలాంటి వేడుకల్లో అన్నీ తానే అయ్యి డ్యాన్సులకు ముందుండేవాడని తెలిపింది. అప్పటి నుంచే బన్ని బెస్ట్ డ్యాన్సర్ అని ఇంట్లో అంతా అనుకునే వాళ్లమని తెలిపారు. చరణ్ చక్కగా డ్యాన్స్ చేస్తాడు. కానీ బన్ని అంత కాదు! అంటూ నిజాయితీగా సుస్మిత అనడాన్ని బట్టి తన గట్స్ ని ముక్కుసూటి తనాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు ఫ్యాన్స్. అయితే చెర్రీ ఫ్యాన్స్ మాత్రం సుస్మిత వ్యాఖ్యపై గుర్రుగా ఉన్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవిని టాలీవుడ్ లో ఎవరు బెస్ట్ డ్యాన్సర్? అని అడిగేస్తే డెఫినెట్ గా చరణ్ మాత్రమేనని చెబుతారు. అయితే తన కూతురు మాత్రం అల్లు అర్జున్ కే ఓటేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -