రాజకీయాల్లోకి అనసూయ.. మాములు ట్విస్ట్ కాదు ఇది..!

936
Anasuya Bharadwaj Plans To Entry In Politics
Anasuya Bharadwaj Plans To Entry In Politics

సినిమాల్లో నటించిన ఎంతో మంది సెలబ్రిటీలు ఇప్పటికే రాజకీయాల్లోకి వెళ్లి రాణిస్తున్నారు. ఇక బుల్లితెరపై ప్రేక్షకులను అలరించిన వారు కూడా రాజకీయాలవైపు వెళ్ళారు. అలా వెళ్లిన కొందరు రాజకీయాల్లో విఫలం కాగా.. కొందరు సక్సెస్ అయ్యారు. అయినప్పటికి కెమెరా ముందు నుంచి ప్రజల ముందుకు వెళ్లి మైకు పట్టుకునేందుకు ఆసక్తి చూపే వారు ఎక్కువవుతేనే ఉన్నారు.

తాజాగా ఇదే బాటలో జబర్దస్త్ బ్యూటీ అనసూయ వెళ్ళడానికి సన్నాహాలు చేస్తోందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. బుల్లితెరపై, వెండితెరపై రాణింస్తున్న పాపులర్ యాంకర్ అనసూయ రాజకీయాలపై దృష్టి పెట్టబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే అధికారంలో ఉన్న పార్టీతో పాటుగా పలు పార్టీల నుంచి ఆమెకు ఆహ్వానం అందినట్లుగా చెప్పుకుంటున్నారు. దాంతో రాజకీయ ఆరంగేట్రంపై తన సన్నిహితులతో చర్చిస్తోందని సమాచారం.

కెరీర్ పీక్‌లో ఉన్న ఈ సమయంలోనే ఎలాంటి అడుగైనా ధైర్యంగా వేయాలనే కోణంలో అనసూయ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కొందరు అనసూయ రాజకీయాలకు వెళ్లడం సరికాదని అంటున్నారు. కెరీర్ మంచి పీక్స్ లో ఉన్నప్పుడు ఈ రాజకీయాలకు జోలికి వెళ్లకుండా ఉంటనే మంచిదని అంటున్నారు. మరి ఈ వార్తలపై అనసూయ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Loading...