ప్రదీప్ పెళ్లి చేసుకోకపోవడానికి రీజన్ ఏంటి ?

576
anchor pradeep busy with career
anchor pradeep busy with career

బుల్లితెరపై టాప్ యాంకర్ గా ప్రదీప్ కొనసాగుతున్నాడు. అప్పుడప్పుడు సినిమాల్లో కూడా చిన్న చిన్న పాత్రలతో అలరిస్తున్నాడు. ప్రస్తుతం ప్రదీప్ ప్రొఫెషనల్ గా చాలా బిజీగా ఉన్నాడు. ప్రదీప్ స్టైల్ ఎనర్జీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సెలబ్రెటీలు సైతం ప్రదీప్ షో అంటే ఓకే అంటూ వచ్చేస్తారు. అలాంటి ప్రదీప్ ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. మరి ఇంతవరకు ప్రదీప్ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఏంటని అందరిలో ఆసక్తి నెలకొంది. ప్రదీప్ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం కెరీర్ అని తెలుస్తోంది.

ప్రదీప్ యాంకర్ గా సక్సెస్ అయ్యాక.. వరస ఆఫర్స్ తో చాలా బిజీగా ఉండేవాడట. నిద్రపోవడానికి కూడా సరైన టైం దొరికేది కాదట. అందుకే ప్రేమ లో పడటం లాంటివి చేయలేదు. పెళ్లి అంటే పెద్ద తంతు.. పెళ్లి కూతురును చూడాలి.. వాళ్ల సంబంధం నచ్చాలి. తల్లిదండ్రులు ఆస్తుల గురించి తెలుసుకోవాలి.. అందుకే అంత టైం లేకపోవడంతో ప్రదీప్ కు పెళ్లి సంబంధాలు చూసి చూసి వారి తల్లిదండ్రులు విసిగిపోయి పెళ్లి నిర్ణయాన్ని ప్రదీప్ కే వదిలేశారట. అయితే ప్రదీప్ యాంకర్ కాకముందు ఓ అమ్మాయిని ప్రేమించాడు. కానీ కొన్ని కారణాల వల్ల విడిపోయారు.

సరైన జాబ్ లేక.. ఆమెని పోషించలేక నిరోద్యోగిగా ఉండటం వల్ల ఆమెను వదులుకోవాల్సి వచ్చిందని.. ప్రస్తుతం ఆమె పిల్లపాపలతో హ్యాపీగా ఉందని చెప్పాడు. తర్వాత ఎన్ని సంబంధాలు వచ్చినా ప్రదీప్ మాత్రం పెళ్లికి నో చెబుతూనే ఉన్నాడు. ఆమెనే ఇంకా ప్రదీప్ మనసులో ఉండిపోవచ్చు అంటున్నారు. ప్రస్తుతం ప్రదీప్ కు 35 ఏళ్లు వచ్చాయట. అందుకే తాను పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యాడు. మరి ప్రదీప్ మనసు దోచే అమ్మాయి ఎప్పుడు దొరుకుతుందో చూడాలి.

Loading...