Friday, March 29, 2024
- Advertisement -

ఇంట్లో వాళ్లు యాంకర్ రవిని కొట్టారు.. ఎందుకంటే ?

- Advertisement -

బుల్లితెరపై సుమ, రష్మీ, అనసూయ ఇలా కొంత మంది ఫీమెల్ యాంకర్స్ ఉన్నారు. అయితే మేల్ యాంకర్స్ మాత్రం చాలా తక్కువ. అందులో ఒకరు యాంకర్ రవి. ఆయన టైమింగ్ లో పంచ్ డైలాగులు వేయడం.. కామెడీ చేయడంలో దిట్ట. ఇప్పటికే ఎన్నో టీవి ప్రోగ్రామ్స్ లో యాంకర్ గా చేశాడు.

అయితే అలీతో సరదాగా ప్రోగ్రాం లో రవి కొన్ని విషయాలు పంచుకున్నాడు. తనకు యాంకర్ శ్రీముఖికి మధ్య ఎఫైర్ లేదని,ప్రోగామ్ చేసేటప్పుడు ఒకరి చేతులు ఒకరు పట్టుకోవడం లాంటివి మాములే అని చెప్పాడు. అయితే రవి ఒక టైంలో ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోదాం అనుకున్నాడట. సినిమాల ప్రభావం తనపై చాలా ఉందని రవి చెప్పాడు. చిరంజీవి అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టమట. ఇక హీరోయిన్స్ లలో ఇలియానా అంటే రవికి ఇష్టమట.

ఓ సారి బంధువులు, స్నేహితులు ఇంటికి వచ్చారు. అందరూ కిందికి వచ్చాక నేను మేడపైకి వెళ్లాను. అక్కడ కాల్చి పారేసిన సగం సిగరెటు ఉంది. దాన్ని తీసి కాల్చాను. అది ఇంట్లో వాళ్లకి తెల్సి చితక్కొట్టారని రవి చెప్పాడు. ఇక ఒక సినిమా ఫంక్షన్ లో ఓ మహిళను కించపరిచేలా మాట్లాడాడన్న విషయాన్ని జీర్ణించుకోలేక పోయానని అన్నాడు. అందరూ అలా మాట్లాడుతుంటే ఇండస్ట్రీ వదిలేసి వెళ్లిపోవాలనిపించింది. మా అమ్మ ,నాన్న ల దగ్గర చాలామంది నా గురించి వెటకారంగా మాట్లాడ్డం బాధేసింది. ఆసమయంలో శ్రీముఖి ఇచ్చిన సపోర్ట్,సుమ మా ఇంటికి ఫోన్ చేసిన ధైర్యం చెప్పడం ఇవన్నీ నన్ను ఇండస్ట్రీలో ఉండేలా చేశాయని రవి తెలిపాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -