Thursday, April 25, 2024
- Advertisement -

శ్రీముఖి లవ్ గురించి యాంకర్ రవి ఏమన్నాడంటే ?

- Advertisement -

యాంకర్ రవికి ఇప్పుడు మంచి క్రేజ్ ఉంది. అతను బుల్లితెరపై అద్భుతంగా రాణిస్తున్నాడు. ప్రధానంగా పటాస్ షో ద్వారా బాగా క్రేజ్ తెచ్చుకున్నాడు. యాంకర్ ప్రదీప్ తర్వాత స్థాయిలో రవి ఉన్నాడు. అయితే ప్రధానంగా రవి పక్కన ఎప్పుడు ఓ ఫీమెల్ యాంకర్ ఉంటుంది. గతంలో లాస్య, రవి కలిసి మంచి ప్రోగ్రామ్స్ చేసేవారు. ఇద్దరి మధ్య ఎలాంటి అభిప్రాయాలు వచ్చాయో తెలియదు కానీ వాళ్లిద్దరు విడిపోయారు తర్వాత శ్రీముఖితో కలిసి పటాస్ చేసి మంచి సక్సెస్ అయ్యాడు రవి.

శ్రీముఖికి కూడా మంచి క్రేజ్ వచ్చింది. ఇక ఇటీవలే శ్రీముఖి బిగ్ బాస్ కు వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ ఓ టాస్క్ లో భాగంగా తమ పర్సనల్ విషయాలను షేర్ చేసుకోవాల్సిందిగా బిగ్ బాస్ అదేశించాడు. అందుకు శ్రీముఖి.. తాను గతంలో ఓ వ్యక్తిని ప్రేమించనని.. పెళ్లి చేసుకుందాం అనుకున్న సమయానికి ఇద్దరి మధ్య గొడవలు వచ్చి విడిపోయాం అని చెప్పింది. అయితే అతను ఓ సెలబ్రెటీ అని చెప్పింది కానీ పేరు చెప్పాలేదు. దాంతో అందరు శ్రీముఖిని మోసం చేసింది యాంకర్ రవి అని అనుకున్నారు.

కానీ తాజాగా రవి ఈ విషయంపై తన సన్నిహితుల వద్ద స్పందించినట్లు తెలుస్తోంది. శ్రీముఖి తనకు మంచి ఫ్రెండ్ అని.. షో చేస్తున్నంత సేపు సరదాగా ఉండేది అని. కానీ ఎప్పుడు తన లవ్ గురించి అడిగి ఇబ్బంది పెట్టలేదని.. తనకు ఎప్పుడు సపోర్ట్ చేస్తూ వచ్చానని… అందురు అనుకుంటున్నట్లు శ్రీముఖి లవర్ తాను కాదని చెప్పినట్లు తెలుస్తోంది. అలానే బిగ్ బాస్ లో తాను బాగా ఆడుతుందని.. ఆమెకి ఓటు వేయాల్సిందిగా రవి చెప్పాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -