Wednesday, April 17, 2024
- Advertisement -

డబ్బు తీసుకుని ఫ్రెండ్ మోసం చేశాడు : రవి

- Advertisement -

తెలుగులో అతి కొద్ది సమయంలో మంచి క్రేజ్ తెచ్చుకుని స్టార్ యాంకర్ గా ఎదిగాడు యాంకర్ రవి. ప్రదీప్ ది ఓ స్టైల్ అయితే యాంకర్ రవిది మరో స్టైల్. రవికి కుర్రాళ్లో మంచి ఫాలోయింగ్ ఉంది. ‘ఢీ’ అలాగే మా మ్యూజిక్ లో కొన్ని షోలతో మంచి ఫాలోయింగ్ సంపాధించుకున్న తర్వాత యాంకర్ లాస్యతో రవి లవ్ లో ఉన్నాడని అప్పట్లో చాలా వార్తలు వచ్చాయి. అయితే తర్వాత అందులో ఎలాంటి నిజం లేదని వీరిద్దరూ క్లారిటీ ఇచ్చారు.

తర్వాత పటాస్ షో తో మంచి ఫామ్ లో ఉన్నప్పుడు ఈ షో నుంచి తప్పుకున్నాడు. శ్రీముఖి తో వివాదం కారణంగా ఆ షో నుండీ తప్పుకున్నాడు అని ప్రచారం జరిగింది. అయితే అలాంటిదేమీ లేదని.. కొత్తగా ఏమైనా చేయాలన్న ఉద్దేశంతోనే ఆ షో నుంచి తప్పుకున్నట్లు రవి చెప్పాడు. ఇప్పుడు రవి సొంతంగా ఓ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి షో లు చెయ్యాలి అని ఆలోచన ఉన్నట్టు తెలిపాడు. ఈ నేపథ్యంలో తన ఆస్తుల గురించి అడిగితే.. నేను ఇప్పటివరకు దాచుకున్న సేవింగ్స్ ఏవి లేవన్నాడు. నా ఫ్యామిలీని మైంటైన్ చెయ్యడానికే నా సంపాదన అయిపొయింది.

నేను సంపాదించుకున్న దాని కంటే పోగొట్టుకున్నదే ఎక్కువ. నా ఫ్రెండ్ ఒకడు నా దగ్గర 45 లక్షలు తీసుకుని హ్యాండ్ ఇచ్చాడు. వాడు చాలా అమాయకుడు. కనీసం స్మోక్ కూడా అలవాటు లేదు. ఒకసారి అతని ఫ్యామిలీ కష్టాల్లో ఉందని చెప్పాడు. అందుకే ఏమి ఆలోచించకుండా 45 లక్షలు ఇచ్చాను. ఇప్పుడు ఆ డబ్బులు ఇవ్వకుండా తిరిగుతున్నాడు. ఇప్పటికీ దానికోసం లీగల్ గా పోరాడుతున్నాని రవి చెప్పాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -