Tuesday, April 23, 2024
- Advertisement -

ర‌ష్మి ఓపెన్ ఆప‌ర్‌… డ‌బ్బులిస్తే దానికి రెడీ ….

- Advertisement -

తెలుగు సినీ ప్రియులకు, టీవీని వీక్షించేవారికి హాట్ యాంక‌ర్ ర‌ష్మి అంటె ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. జ‌బ‌ర్ద‌స్త్ ద్వారా ఎంత పాపులారిటీ సంపాదించిందో అంద‌రికి తెలిసిందే. తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ..అవకాశం ఉన్నప్పుడు అడపా దడపా సినిమాలు చేస్తూ.. తగిన మోతాదుల్లో అందాలను కనువిందు చేస్తూ..తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా క్రేజ్ సంపాదించుకుంది రష్మీ.

మొదట సినిమాల్లో నటించి ఆ తర్వాత బుల్లితెరకు షిఫ్ట్ అయిన అందాల భామ రష్మి గౌతం జబర్దస్త్ షోలోకి షిప్ట్ అయ్యింది. బుల్లితెర మీద వచ్చిన ఈ క్రేజ్ తో గుంటూర్ టాకీస్ సినిమాతో దుమ్ముదులిపేసింది. ఆ సినిమాలో అమ్మడి హాట్ షోకి కుర్రాళ్లు పిచ్చెక్కిపోయారు. ఆ సినిమా హిట్ అవడంతో రష్మికి వరుసగా అలాంటి ఛాన్సులే వస్తున్నాయి.

ర‌ష్మి ముక్కుసూటిగా మాట్లాడే మ‌న‌స్త‌త్వం. డబ్బు కోసం నేను గ్లామ‌ర్ పాత్రలు చేస్తున్నా అంటుంది. అయితే తన దగ్గరకు వచ్చే దర్శక నిర్మాతలు అలాంటి సినిమాలే చేయాలని అంటున్నారు. తనకు మంచి పాత్రలు చేయాలని ఉందని కాకపోతే తనకు రొటీన్ ఛాన్సులే వస్తున్నాయని అంటుంది. డబ్బులిస్తే ఎలాంటి పాత్రకైనా సరే అంటున్న రష్మి ఛాన్స్ వస్తే మాత్రం తన సత్తా చాటుతా అంటుంది. మరి రష్మిలోని టాలెంట్ ను గుర్తించి ఆ ఛాన్స్ ఇచ్చే దర్శకుడు ఎవరో చూడాలి .

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -