లవ్ మ్యారేజ్ కు ఇంట్లో ఒప్పుకోలే.. నా భర్త మీదా డౌట్ : యాంకర్ శ్యామల

2552
anchor shyamala shocking comments on her husband
anchor shyamala shocking comments on her husband

టాలీవుడ్ లో ఇండస్ట్రీలో యాంకర్స్ కి మంచి క్రేజ్ ఉంది. ప్రస్తుతం యాంకర్స్ మధ్య పోటీ తీవ్రత బానే ఉంది. ఇక యాంకర్ శ్యామల కూడా సోశల్ మీడియాలో అప్పుడప్పుడూ తన ఫోటోలను పోస్ట్ చేసి నెటిజన్స్ ని ఎట్రాక్ట్ చేస్తోంది. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్యామల తన లవ్ స్టోరీ గురించి చెప్పింది.

లాక్ డౌన్ లో తన ఫ్యామిలీతో సరదాగా గడుపుతున్న ఈ యాంకర్ సమయం దొరికినప్పుడల్లా సోషల్ మీడియా ద్వారా ఫాలోవర్స్ తో కూడా ముచ్చటిస్తోంది. ఈ యాంకరమ్మ లవ్ మ్యారేజ్ చేసుకుంది. సహా నటుడు నరసింహను ప్రేమించిన శ్యామల ఇంట్లో వాళ్లకు ప్రేమ వ్యవహారాన్ని మర్యాదపూర్వకంగా చెప్పగా వారు తిరస్కరించారు. కొన్నాళ్లపాటు ఓపిక పట్టిన ఆ జంట చివరికి ఒకటవ్వక తప్పలేదు. శ్యామల పెళ్లి చేసుకొని చాలా కాలమవుతోంది. 2007లోనే టీవీ యాక్టర్ నరసింహను ప్రేమించి పెళ్లి చేసుకుంది.

ఆ తరువాత యధావిధిగా కెరీర్ ని కొనసాగించారు. ఇక 2017లో వీరికి ఒక బాబు కూడా పుట్టాడు. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తన భర్త గురించి శ్యామల కొన్ని కామెంట్స్ కూడా చేసింది. పెళ్లి తరువాత ఇంకా బాగా లవ్ చేస్తున్నారని ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారని చెప్పింది. ఇక అప్పుడప్పుడు కొన్ని విషయాల్లో తన భర్తను చూస్తే కాస్త డౌట్ వస్తుందని నిజంగా ఆయన నన్ను ప్రేమగా చూసుకుంటున్నాడా లేదా అనే అనుమానం కలుగుతుంది. ఆ విషయం గురించి నా భర్తతో కూడా చర్చిస్తాను అని యాంకర్ శ్యామల సరదాగా వివరణ ఇచ్చింది. ఇక ఏ విషయంలోనైన నా భర్త నన్ను నమ్ముతాడని శ్యామల చెప్పుకొచ్చింది.

Loading...