బిగ్ బాస్ : శ్రీముఖిని లవ్ పేరుతో మోసం చేసింది ఎవరు ?

29590
Anchor Srimukhi About Her Secret Boyfriend
Anchor Srimukhi About Her Secret Boyfriend

శ్రీముఖి అంటే అల్లరిగా కనిపిస్తూ ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటుందని అందరికి తెలుసు. కానీ ఆమె బాధపడిన సందర్భాలు ప్రేక్షకులు ఎవరు ఎప్పుడు చూడలేదు. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో శ్రీముఖి చలకీగా దూసుకెళ్తోంది. ఫైనల్ వీక్ లోకి బిగ్ బాస్ వెళ్లడంతో అందరు ఫైనల్ పోరుకు సిద్దం అయ్యారు. తన సీక్రెట్ లైఫ్ కు సంబంధించిన నిజాల్ని చెప్పాలంటూ బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ను పూర్తి చేసే క్రమంలో సంచలన నిజాల్ని బయటపెడుతూ.. గతంలో తనకో లవ్ స్టోరీ ఉందని చెప్పింది శ్రీముఖి.

తామిద్దరి మధ్య మంచి రిలేషన్ ఉండేదని.. అన్ని సెట్ అయిపోయాయి.. పెళ్లి మాత్రమే మిగిలిందన్న వేళ ఊహించని షాక్ తగిలినట్లు చెప్పింది. లేనిపోని మనస్పర్థల కారణంగా కెరీర్ సూపర్ సక్సెస్ తో సాగుతుంటే.. లవ్ లైఫ్ లో దారుణమైన పరిస్థితులు ఎదురైనట్లు వెల్లడించింది. తన లైఫ్ లో ఉన్నది కూడా ఒక సెలబ్రిటీనే అంటూ చెప్పింది. హ్యాపీగా సాగుతున్న తమ లవ్ లోకి అనుకోని డిస్ట్రబెన్స్ లు వచ్చాయని.. ఈ కారణంతో అతనితో పెళ్లి వరకు వెళ్లిన వ్యవహారం మధ్యలోనే ఆగిపోయినట్లు తెలిపింది.

దాంతో చనిపోదాం అనుకున్నట్లు పేర్కొంది. చాలా సార్లు మేకప్ రూంలో విపరీతంగా ఏడ్చినట్లు వెల్లడించింది. శ్రీముఖి బయట పెట్టిన ఆ సీక్రెట్ వ్యక్తి ఎవరన్నది ఇప్పుడు చర్చగా మారింది. అప్పట్లో యాంకర్ రవితో శ్రీముఖి లవ్ సాగిందన్న రూమర్స్ వచ్చాయి. వీరిద్దరు కలిసి చేసిన పటాస్ షో సూపర్ హిట్ అయింది. కానీ ఆ షో నుంచి ఆమె బయటకు వచ్చింది.

మరి ఆమె వెల్లడించిన సీక్రెట్ లైఫ్ లో ఉన్నది యాంకర్ రవినేనా? అన్నది ఇప్పుడు అందరికి డౌట్ కలుగుతోంది. మరో వైపు శ్రీముఖి అప్పట్లో ప్రదీప్ తో కూడా యాంకరింగ్ చేసింది. ఇంతకీ వీరిద్దరిలో శ్రీముఖి చెప్పింది ఎవరి గురించి అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఇంకోవైపు వీరిద్దరు కాదు.. మరో వ్యక్తి అయ్యి ఉండొచా ? అన్నది కూడా సరికొత్త చర్చకు దారి తీసింది.

Loading...