Friday, April 19, 2024
- Advertisement -

నేను హీరోయిన్ కాలేను : యాంకర్ శ్యామల

- Advertisement -

శ్యామల.. యాంకర్ గా చేస్తూనే ఆర్టిస్ట్ గా కూడా చేస్తోంది. ఇప్పటికే చాలా సినిమాల్లో నటించింది. చాలా ప్రీరిలీజ్ ఫంక్షన్స్ కి యాంకర్ గా చేసింది. బుల్లితెరపై సీరియల్స్ చేసింది. బుల్లితెర పై షోస్ చేసింది. ఆ విధంగా శ్యామలకు మంచి క్రేజ్ ఉంది. అయితే యాంకర్ శ్యామల హీరోయిన్ గా చూడాలని చాలా మంది కోరుకుంటారు.

కానీ ఆమెకి హీరోయిన్ గా చేయడం ఇష్టం లేదని చెబుతోంది. ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు చెప్పుకొచ్చింది. ’నేను సక్సెస్ ను రుచి చూస్తునే ఉన్నా.. ఇంకా పూర్తి కాలేదు. ఓ మధ్య తరగతి నుంచి వచ్చిన నన్ను ఇంత మంది అభిమానులు అదరించడం.. శ్యామలా అని పిలుస్తే నాకు హ్యాపీగా అనిపిస్తోంది. ఔట్ డోర్ షూటింగ్ లకు వెళ్తుంటే.. చాలా మంది ఆంటీలు నా దగ్గరకు వచ్చి నువ్వు బాగా చేస్తావు అంటే సంతోషంగా అనిపిస్తోంది. నాకు హీరోయిన్ కావడం పెద్దగా ఆసక్తి లేదు. అసలు ఇష్టం లేదు.

హీరోయిన్ గా చేయాలంటే చాలా రెస్పాన్సిబులిట్స్ ఉంటాయి. గ్లామర్ షో చేయాలి. దాన్ని నేను మెయిన్ టైన్ చేయలేను. హీరోయిన్ చూడగానే భలే ఉందిరా అన్నట్లు ఉండాలి. నేను అందంగా ఉన్నప్పటికి.. నిద్ర, తిండి మస్ట్ గా ఉండాలి. కానీ హీరోయిన్ ఈ రెండింటీని త్యాగం చేయాలి. అది నా వల్ల అసలు కాదు. ఫ్యూచర్లో కూడా హీరోయిన్ ఛాన్స్ వస్తే అసలు ఒప్పుకోను.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -