పెళ్లి చేసుకోను.. సుధీర్ తో ఎఫైర్ నిజం కాదు : వర్షిణి

1889
anchor varshini about her marriage with sudigali sudheer
anchor varshini about her marriage with sudigali sudheer

బుల్లితెర యాంకర్ రాణిస్తోంది వర్షిణి. అందం, అభినయంతో ఆకట్టుకుంటుంది. అయితే సెలబ్రిటీల విషయంలో రూమర్స్ కామన్. అలానే వర్షిణి విషయంలో కొన్ని వార్తలు హల్ చల్ చేశాయి. తాజాగా ఆ రూమర్స్ పై క్లారిటీ ఇచ్చింది వర్షిణి. నిజానికి వర్షిణి అసలు పేరు షామిలి. న్యూమరాలజీ వల్ల ఆమె పేరు మార్చుకున్నారు. పెళ్ళి గురించి ఆమె చెబుతూ.. జీవితంలో ఎప్పుడు పెళ్లి చేసుకొంటావని అడుగుతుంటారు.

జీవితంలో పెళ్లి చేసుకోవడం అవసరమా? నాకు పెళ్లి మీద మంచి అభిప్రాయం లేదు. పెళ్లి విషయంలో నన్ను మరోలా అర్ధం చేసుకోవవద్దు. జీవితంలో నాకు పెళ్లి చేసుకోవాలనే కోరిక లేదు. కానీ భవిష్యత్‌లో ఏం జరుగుతుందో చెప్పలేను. ప్రస్తుతం నాకు ఎలాంటి అఫైర్లు లేవు. సింగిల్ స్టేటస్ చాలా బాగుంది అని వర్షిణి పేర్కొన్నారు. ఇండస్ట్రీలో నాకు రవి, సుధీర్ మంచి ఫ్రెండ్స్. బయట లైఫ్‌లో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ప్రస్తుతం నా కెరీర్ బాగా ఉంది. నా లైఫ్‌ను నేను ఎంజాయ్ చేస్తున్నాను అని వర్షిణి తెలిపారు. ఆన్‌స్క్రీన్‌లో సుడిగాలి సుధీర్‌తో కెమిస్ట్రీకి మంచి క్రేజ్ వచ్చింది.

అప్పటి నుంచి సుధీర్‌ను పెళ్లి చేసుకోవచ్చుగా అంటున్నారు. కానీ ఆన్‌స్క్రీన్ వరకు మాత్రమే అలా అనిపిస్తుంది. సుధీర్‌కు నాకు మధ్య మంచి ఫ్రెండ్‌షిప్ ఉంది. బ్రదర్ లాంటి వాడితో పెళ్లి అనేది తప్పు అని అన్నారు. ప్రేక్షకులు అలా ఊహించుకోవడంలో తప్పేమీ లేదు అనుకొంటాను అని వర్షిణి చెప్పింది. నా కంటే రష్మి, సుధీర్ మధ్య కెమిస్ట్రీ మధ్య కెమిస్ట్రీ బాగుంటుంది అని వర్షిణి చెప్పుకొచ్చింది.

Loading...