Friday, April 19, 2024
- Advertisement -

కాస్టింగ్ కౌచ్ పై వర్షిణి షాకింగ్ కామెంట్స్..!

- Advertisement -

సినిమా పరిశ్రమలో హీరోయిన్లకు మాత్రమే కాస్టింగ్ కౌచ్ ఎదురవుతుందని అనుకుంటే పొరపాటే. ఎందుకంటే యాంకర్లు కూడా ఈ బాధితుల్లో ఉన్నారు. ఇప్పుడు ఈ లిస్ట్ లో హాట్ యాంకర్ వర్షిణి కూడా వచ్చి చేరింది. వర్షిణి కెరీర్ పరంగా మొదట్లో కంటే ఇప్పుడు మంచి ఫాంలో ఉంది. ఆ మ‌ధ్య ‘పెళ్లిగోల’ అనే వెబ్ సిరీస్ లో నటించి మంచి గుర్తింపే తెచ్చుకుంది.

ఇప్పుడు యాంకర్ గా మంచి ఫాలోయింగ్ సంపాధించుకుంది. తన హాట్ లుక్స్ తో బుల్లితెర ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తోంది. ఈ అందాల భామకు కూడా కాస్టింగ్ కౌచ్ ఎదురైందట. ఈ విషయంను స్వయంగా ఆమెనే చెప్పింది. తన లైఫ్ లో ఇప్పటివరకు ఎదురైన చేదు జ్ఞాపకం అదొక్కటేనని అంటుంది. ఓ వెబ్ సిరీస్ లో నటించే ఆఫర్ రావడంతో.. వెళ్లి దర్శకుడ్ని కలిసిందట వర్షిణి. కాసేపు తనతో మాట్లాడిన తరువాత.. తప్పుగా ప్రవర్తించడం మొదలుపెట్టాడట. లాక్ డౌన్ కి ముందు ఈ ఘటన జరిగిందని చెప్పుకొచ్చింది.

సదరు డైరెక్టర్ తన చేయి పట్టుకొని లాగాడని.. దీంతో వెంటనే అక్కడ నుండి బయటకి వచ్చేసినట్లు వర్షిణి చెప్పుకొచ్చింది. తర్వాత కారులో కూర్చుని ఏడ్చానని.. చాలా బాధపడ్డానని చెప్పింది. ఈ విషయం తన తల్లిదండ్రులకు చెప్పలేకపోయానని.. కేవలం ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ తో మాత్రమే షేర్ చేసుకున్నట్లు వెల్లడించింది. అయితే ఆ డైరెక్టర్ ఎవరనే విషయాన్ని మాత్రం వర్షిణి చెప్పలేదు.

నటి సీత ఇప్పుడు ఎలా ఉందో ఏం చేస్తుందో తెలుసా ?

నోయెల్ తో విడిపోయిన తర్వాత ఎస్తర్ ఏం చేస్తుందో తెలుసా ?

సుడిగాలి సుధీర్‌కు కరోనా.. రష్మి గౌతమ్ పరిస్థితేంటి..?

జై చిరంజీవ నటించిన ఈ పాప ఇప్పుడెలా ఉందో తెలుసా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -