Thursday, April 25, 2024
- Advertisement -

హైపర్ ఆదితో ఎఫైర్ పై స్పందించిన వర్షిణి..!

- Advertisement -

జబర్దస్త్ షో ద్వారా తనకంటూ ఓ స్పేషల్ క్రేజ్ సంపాధించుకున్నాడు హైపర్ ఆది. ఇతను చేసే కామెడీకి ఆడియన్స్ పొట్టచెక్కలయ్యేలా నవ్వాల్సిందే. ఆది పంచులు అలా ఉంటాయి మరి. అయితే జబర్దస్త్ లో చేస్తూనే మరో షోలో హోస్ట్ గా కూడా కొత్త అవతారమెత్తాడు. యాంకర్ వర్షిణితో కలిసి బుల్లితెరపై రొమాంటిక్ కిక్ ఇస్తున్నాడు.

ఢీ షోలో వర్షిణితో రెచ్చిపోయి మరి ఆది రొమాన్స్ చేస్తూ.. తనలో ఉన్న మరో టాలెంట్ ఏంటో చూపిస్తున్నాడు. వీళ్లిద్దరి రొమాంటిక్ డోస్ ఈ షోకి మాంచి టీఆర్ఫీ రేటింగ్ తీసుకొస్తోంది. హైపర్ ఆది- వర్షిణి మధ్య ఏదో నడుస్తోందని, వాళ్లిద్దరూ ఘాడ ప్రేమలో ఉన్నారు కాబట్టే ఈ రేంజ్ రొమాంటిక్ డ్యూయెట్స్ చేస్తున్నారనే టాక్ వచ్చింది. తాజాగా నెటిజన్లతో ఆన్‌లైన్ చాట్ చేసిన వర్షిణికి ఇదే ప్రశ్న ఎదురైంది. మీరు, హైపర్ ఆది ప్రేమించుకుంటున్నారా ? అని ఓ నెటిజన్ ప్రశ్నించాడు.

దీనిపై రియాక్ట్ అయిన వర్షిణి తనదైన స్టైల్‌లో సమాధానమిచ్చింది. అలాంటిదేమీ లేదని, హైపర్ ఆది తనకు స్నేహితుడు మాత్రమే అని చెప్పింది. అలాగే సుడిగాలి సుధీర్ తన ఫ్యామిలీ మెంబర్ లాంటివాడని ఆమె తెలిపింది. ఇక గతంలో హైపర్ ఆది కూడా వర్షిణితో ప్రేమ అంటూ వస్తున్న వార్తలపై ఖండించారు. కేవలం షోస్ కేసమే అలా చేస్తామని.. అందులో నిజం లేదని.. కేవలం రేటింగ్ కోసం మాత్రమేనని వీరిద్దరు చెప్పుకొచ్చారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -