Friday, April 19, 2024
- Advertisement -

హైపర్ ఆదితో వర్షిణి పెళ్లి.. ?

- Advertisement -

కమెడియన్ హైపర్ ఆది జబర్ధస్త్ అనే కామెడీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన విషయం తెలిసిందే. తాజాగా హైపర్ ఆది పెళ్లి గురించి ఓ న్యూస్ వైరల్ అవుతోంది. విషయంలోకి వెళ్తే.. బుల్లితెరపై సక్సెస్‌ఫుల్ కెరీర్‌ను కొనసాగిస్తున్న హైపర్ ఆది.. సినిమా రంగంలోకి సైతం రాణిస్తున్నాడు. ఇప్పటికే పలు సినిమాల్లో నటించాడు.

ఆది జబర్దస్త్ షో తో పాటు బిగ్గెస్ట్ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ లో కూడా కనిపిస్తున్నాడు. ఈ షో అంటే డ్యాన్స్‌లతో పాటు యాంకర్.. టీమ్ లీడర్ల మధ్య పంచ్ డైలాగులు కూడా గుర్తొస్తుంటాయి. వాటిని రాసేది ఆదినే అన్న విషయం చాలా మందికి తెలీదు. ‘ఢీ’షోకు చాలా కాలం నుంచి స్క్రిప్ట్ రైటర్ గానే పని చేస్తున్న ఆది.. అందులోకి టీమ్ లీడర్‌గా ఎంట్రీ ఇచ్చాడు. సుడిగాలి సుధీర్, రష్మీ ఓ టీమ్‌ను లీడ్ చేస్తుండగా.. మరో టీమ్‌ను యాంకర్ వర్షిణితో కలిసి లీడ్ చేస్తున్నాడు ఆది.

ఈ క్రమంలోనే తన సహచర హాట్ యాంకర్‌తో తరచూ రొమాన్స్ చేస్తూ హాట్ టాపిక్ అవుతున్నాడు. ఈ క్రమంలోనే ఆమెతో లవ్ ట్రాక్ నడుపుతున్నాని చెప్పడం కలకలం రేపింది. వచ్చే వారం ఎపిసోడ్‌లో వర్షిణి.. ఆదిని ఉద్దేశిస్తూ.. ‘నిన్ను బావ అని పిలవాలనిపిస్తుంది. వచ్చే ఏడాదికల్లా మనం ఇల్లు, కారు కొనుక్కోవాలి’ అని కామెంట్ చేసింది. దీంతో వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే అదంతా స్కిట్ లో భాగం అని హైపర్ ఆది తన సన్నిహితుల వద్ద అన్నాడట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -