సుధీర్ అంటే చాలా ఇష్టం.. సుధీర్ గురించి చెప్పిన విష్ణుప్రియ..!

1278
anchor vishnupriya clarity about sudigali sudheer
anchor vishnupriya clarity about sudigali sudheer

తెలుగు బుల్లితెరపై తన అందమైన.. అల్లరి మాటలతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది యాంకర్ విష్ణు ప్రియ. అయితే సుడిగాలి సుధీర్ తో ప్రేమాయణం సాగిస్తుందని గత కొంత కాలంగా రూమర్స్ వస్తుండటంతో.. తాజాగా విష్ణు ప్రియ స్పందించింది. విషయంలోకి వెళ్తే.. షార్ట్ ఫిల్మ్ నుంచి టీవీ రంగంలోకి అడుగుపెట్టింది విష్ణుప్రియా.

తన కెరీర్ ప్రారంభంలో కొన్ని షోలకు యాంకరింగ్ చేసినప్పటికీ విష్ణు ప్రియకు అంతగా గుర్తింపు రాలేదు. కానీ సుడిగాలి సుధీర్ తో కలిసి చేసిన పోవే పోరా షోకి మంచి పాపులారిటీ వచ్చింది. షో రేటింగ్ కూడా పెరిగింది. అయితే, కొన్నేళ్లుగా విష్ణ ప్రియతో సుధీర్ ప్రేమలో పడ్డాడని వార్తలు వస్తున్నాయి. అందుకు కారణం పోవే పోరా షోలో వీళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్క్ వట్ కావడమే.

తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో విష్ణు ప్రియ మాట్లాడుతూ.. ‘శ్రీముఖి నా బెస్ట్ ఫ్రెండ్. తను వచ్చిన తర్వాత నా జీవితం ఒక్కసారిగా మారిపోయింది. తను పక్కనుంటే నేనెప్పుడూ నవ్వుతూనే ఉంటాను. ఇక సుధీర్ అంటే నాకు చాలా ఇష్టం. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత నాకు క్లోజ్ అయిన మొదటి వ్యక్తి అతడే. నేను సంతోషంగా ఉన్నా.. బాధలో ఉన్నా.. మొదట కాల్ చేసేది సుధీర్‌కే. తను ఉంటే చాలా ధైర్యంగా ఉంటుంది. అలా అని మేమిద్దరం లవర్స్ కాదు. బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే’ అని విష్ణు ప్రియా చెప్పుకొచ్చింది.

Loading...