Thursday, April 25, 2024
- Advertisement -

బెడ్ రూమ్ సీన్స్ చేసి తప్పు చేశాను : ఆండ్రియా

- Advertisement -

సినిమా రంగంలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. రొమాంటిక్ సీన్స్ లలో చేస్తే ఒక్క రోజులో స్టార్స్ అయిపోతారు. అయితే ఇదే ఫార్ములా ప్రతి సారి వర్కౌట్ కాదు. ఆండ్రియా జెరెమియా కూడా పరిస్థితి ఇదే. ఈమెకు ఎక్కువగా రొమాంటిక్ పాత్రలే వస్తున్నాయి. యుగానికి ఒక్కడు సినిమా ఆండ్రియాకు మంచి ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది.

మొదట్లో డిఫరెంట్ రోల్స్ చేసింది. ఆ తరువాత ఆమెకు రొటీన్ ఆఫర్స్ ఎక్కువగా వచ్చాయి. కమల్ హాసన్ తో విశ్వరూపం తరువాత ఆండ్రియా సినిమాల్లో రొమాన్స్ డోస్ ఎక్కువైంది. మెయిన్ గా వడచెన్నై సినిమాలో ఈ బ్యూటీ బెడ్ రూమ్ సీన్ లో గట్టిగానే రెచ్చిపోయింది. అయితే ఇప్పుడు అదే ఆమెకు శాపంలా మారుతోందట. చాలా వరకు ఆ సినిమాలోని కొన్ని సీన్లను ఎడిటింగ్ లో తీసేశారట. ఎడిటింగ్ లేపేసిన బోల్డ్ సీన్స్ సోషల్ మీడియాలో లీక్ కావడంతో ఆండ్రియాకు దెబ్బ పడింది.

ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆండ్రియా ఆసక్తికర విషయాలు చెప్పింది. నిజంగా వడచెన్నై సినిమాలో రొమాంటిక్ డోస్ ఎక్కువైందని, అలా నటించి చాలా తప్పు చేశానని చెప్పింది. ఇక ఏదైన సినిమా ఆఫర్ వస్తే.. అందులో బెడ్ రూం సీన్ చేయాల్సిందే అని ఆండ్రియాకు దర్శక నిర్మాతలు కండిషన్స్ పెడుతున్నారట. మొత్తానికి ఈ అందాల భామ ఓ సీరియస్ నిర్ణయం తీసుకుంది. ఇక పై అలాంటి బెడ్ రూమ్ సీన్స్ చేయను అని చెబుతుంది. అంతేకాదు కేవలం పాత్రకు ప్రాధన్యం ఉన్న వాటికే గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని డిసైడ్ అయినట్లు చెబుతోంది.

బండ్ల గణేష్ తో పవన్ కళ్యాణ్ నిజమేనా…

విజయ్ ఫ్యామిలీ పార్టీలో రష్మీక.. లవ్ కాబాట్టే పిలిచాడా ?

డ్రగ్ కేసులో నమ్రత.. అందుకే తీసుకునేదా ?

అభిజిత్ చేసిన పనికి కన్నీళ్ళు పెట్టుకున్న మోనాల్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -