Saturday, April 20, 2024
- Advertisement -

ఆఫర్స్ లేక అను ఇమ్మాన్యుయల్ ఏం చేస్తుందంటే ?

- Advertisement -

నాని హీరోగా వచ్చిన ‘మజ్ను’ సినిమాతో తెలుగు ప్రేక్షకుకు పరిచయం అయింది అను ఇమ్మాన్యుయల్. మొదటి సినిమాతోనే మంచి నటిగా పేరు తెచ్చుకుంది ఈ అందాల భామ. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసింది. అయితే తక్కువ టైంలోనే పవన్ కళ్యాణ్- త్రివిక్రమ్ ల ‘అజ్ఞాతవాసి’ చిత్రంలో నటించే ఛాన్స్ కొట్టేసింది.

ఇదే తరుణంలో అల్లు అర్జున్ తో ‘నా పేరు సూర్య’ సినిమాలోనూ నటిచింది. అయితే ఈ రెండు సినిమాలు ప్లాప్ కావడంతో ఈమెకు పెద్దగా అవకాశాలు రావడం లేదు. పైగా ఐరన్ లెగ్ అనే ముద్ర కూడా ఈమె పై పడింది. అయినా సరే నాగ చైతన్య హీరోగా వచ్చిన ‘శైలజారెడ్డి అల్లుడు’ చిత్రంలో అవకాశం ధక్కించుకుంది. కానీ ఆ సినిమా కూడా ప్లాప్ అయ్యింది. దీంతో వచ్చే అవకాశాలు కూడా వెనక్కి వెళ్లాయి. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న ‘అల్లుడు అదుర్స్’ చిత్రంలో నటిస్తుంది.

అయితే ఇందులో ఈమెది చిన్న పాత్ర. పైగా సినిమాలో ఆ పాత్రకి అంత ప్రాముఖ్యత కూడా ఉండదట. దీంతో ఇక వెబ్ సిరీస్ లలో నటించడానికి రెడీ అవుతుంది. బోల్డ్ పాత్రలకు సైతం ఈమె ఓకే చెబుతుందట. గ్లామర్ షో కి కూడా ఏమాత్రం అడ్డు చెప్పను అని చెబుతుందట. ఎంత అవకాశాలు రాకపోతే మాత్రం ఇన్ని ఓపెన్ ఆఫర్లు ఇచ్చెయ్యాలా అంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -