Thursday, April 25, 2024
- Advertisement -

RRR లో అనుష్క.. రాజమౌళి ప్లాన్ ఇదే..!

- Advertisement -

బాహుబలి సినిమా ఎంత పెద్ద విజయం సొంతం చేసుకుందో అందరికి తెలిసిందే. ఈ సినిమా ద్వారా అనుష్క ఎంతో పేరు సంపాధించుకుంది. కానీ ఈ సినిమా తర్వాత ఆమె పరిస్థితి తారుమారు అయ్యింది. కొన్ని కారణాల వల్ల కొంత గ్యాప్ తీసుకుని ప్రస్తుతం ’నిశబ్దం’ అనే సినిమాలో నటిస్తోంది. ఇదే సమయంలో అనుష్క కొన్ని సినిమాల్లో స్పెషల్ రోల్స్ చేస్తోంది.

సైరా చిత్రంలో జాన్సీ లక్ష్మీ బాయి పాత్రలో కొన్ని నిమిషాల పాటు నటించి అదరగొట్టింది. అయితే ఆమె చేసింది చిన్న పాత్ర అయినప్పటికి సినిమా ఓ లెవల్ కి తీసుకెళ్లడంలో సక్సెస్ అయింది. ఇక సైరా తర్వాత మరో పెద్ద సినిమాలో అనుష్క గెస్ట్ రోల్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్. టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్లు నటిస్తున్న ఈ భారీ మల్టీస్టారర్ సినిమాలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్, బాలీవు డ్ హీరోయిన్ ఆలియా భట్ తో పాటు ఇంకా ప్రముఖ నటీ నటులు నటిస్తున్నారు.

ఇంత పెద్ద కాస్ట్ ఉన్న ఈ సినిమాలో అనుష్కను కూడా గెస్ట్ రోల్ లో చూపిస్తే బాగుంటుందని జక్కన్న భావిస్తున్నాడట. రాజమౌళి తన సినిమాల్లో కావాలని పాత్రలను క్రియేట్ చేయడు. కథానుసారంగానే పాత్రలను సృష్టిస్తాడు. అలా ఆర్ఆర్ఆర్ మూవీలో అనుష్క ఓ చిన్న పాత్ర చేస్తే సినిమాకు మరింత హైప్ వస్తుందని భావిస్తున్నాడట. రాజమౌళితో అనుష్కకు మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. అందుకే ఆర్ఆర్ఆర్ లో నటించేందుకు ఒప్పుకుంది అంటూ ప్రచారం జరుగుతోంది. మరి ఈ విషయంపై అనుష్క ఎలా స్పందిస్తుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -