Friday, March 29, 2024
- Advertisement -

దర్శకుడి కొడుకుతోనే అనుష్క పెళ్లి.. నిజమే..?

- Advertisement -

టాలీవుడ్ లో ప్రభాస్ పెళ్లి గురించి ఏ స్థాయిలో ప్రచారం జరుగుతుందో అదే స్థాయిలో అనుష్క పెళ్లి గురించి కూడా ప్రచారం జరుగుతోంది. గత ఆరు ఏళ్లుగా అనుష్క పెళ్లి గురించి మీడియాలో ఏవో వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ తో అనుష్క లవ్ లో ఉందని.. త్వరలో పెళ్లి కూడా ఉండబోతుందని వంటి వార్తలు కూడా వచ్చాయి.

అయితే అందులో ఎలాంటి నిజం లేదని వీరిద్దరు క్లారిటీ ఇచ్చారు. ఆ మధ్య అనుష్క ఓ క్రికెటర్ ని పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఒక దర్శకుడి కొడుకుతో పెళ్లికి అనుష్క రెడీ అయ్యిందని ప్రచారం జరిగింది. అయితే ఆ దర్శకుడి కొడుకుకు అప్పటికే పెళ్లి అయ్యి విడాకులు కూడా అయ్యాయి. దాంతో అంతా కూడా అవాక్కయ్యారు. అయితే ఆ వార్తలు నిజం కాదని ఎక్కువ మంది అన్నారు. దాంతో నిజమే అనుష్కకు రెండవ పెళ్లి వ్యక్తిని చేసుకోవాల్సిన అవసరం ఏంటని ఆ వార్తలను చాలా మంది నమ్మలేదు. కాని మళ్లీ ఆ వార్తలే ప్రముఖంగా వస్తున్నాయి.

ఆ దర్శకుడి కొడుకుని అనుష్క పెళ్లి చేసుకోబోతుందని ప్రముఖంగా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం అనుష్క చేసే సినిమాలు కంప్లీట్ అవ్వగానే పెళ్లికి రెడీ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఆ కుటుంబంకు అనుష్క చాలా క్లోజ్ గా మూవ్ అవుతుందనేది కొందరి వాదన. కాని అనుష్క ఫ్యాన్స్ మాత్రం ఈ వార్త నిజం కాకుంటే బాగుంటుందని అంటున్నారు. రెండవ పెళ్లి వ్యక్తిని చేసుకోవాల్సిన అవసరం అనుష్కకు లేదని ఫ్యాన్స్ అభిప్రాయం. మళ్లీ జోరుగా ప్రచారం జరుగుతున్న ఈ పుకార్లపై అనుష్క ఏమైనా రియాక్ట్ అవుతుందో చూడాలి.

శ్రీదేవి డబ్బుల కోసం కుట్ర జరిగింది : శ్రీదేవి మేనమామ

16 ఏళ్లకే ప్రేమలో పడ్డా.. తొమ్మిదేళ్లు పొరాడాను : అనసూయ

నాగబాబు పై ఫైర్ అయిన ఎన్టీఆర్.. ఎందుకు ?

మహేష్ – పరశురామ్ సినిమా స్టోరీ లీక్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -