Tuesday, April 16, 2024
- Advertisement -

గుణశేఖర్ శాకుంతలం లో హీరోయిన్ ఎవరో తెలుసా..?

- Advertisement -

రుద్రమదేవి సినిమా తర్వాత గుణశేఖర్ దాదాపు నాలుగేళ్ళ తర్వాత శాకుంతల అనే సినిమా ని అధికారికంగా అనౌన్స్ చేశాడు గుణశేఖర్.. ఫస్ట్ లుక్ లోనే ఎంతో వెరైటీ సినిమా గా అనిపించుకుంది శాకుంతల.. మోషన్ పోస్టర్ లో ఎంతో ఫ్రెష్ ఫీలింగ్ అయితే కనిపిస్తుంది.. ఎక్కడా పాత్ర రివీల్ చేసినట్లు కనపడట్లేదు.. గుణశేఖర్ ఈ సినిమా పై చేసిన కసరత్తు క్లియర్ గా కనిపిస్తుంది.. ఇక గుణశేఖర్ ఎన్నో కలలు కన్న సినిమా హిరణ్యకశ్యప ఇక పక్కన పెట్టేశాడనే చెప్పాలి.. కరోనా దెబ్బకు కథ మొత్తం మారిపోయింది. టాలీవుడ్లో పేరుమోసిన ఫైనాన్షియర్లందరూ కూడా ఆర్థికంగా దెబ్బ తిన్నారు. నిర్మాతలందరికీ కాసుల కటకట మొదలైంది.

బడ్జెట్లు తగ్గించుకోక తప్పని పరిస్థితి. భారీ చిత్రాల విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించక తప్పట్లేదు. ఈ నేపథ్యంలో ‘హిరణ్య కశ్యప’ లాంటి రిస్కీ ప్రాజెక్టును ఇప్పుడు తలకెత్తుకోవడం అంటే సాహసమే. అందుకే సురేష్ బాబు ఆ ప్రాజెక్టును హోల్డ్‌లో పెట్టినట్లు తెలుస్తోంది. దాంతో టైం వేస్ట్ చేయకుండా శాకుంతల అనే పేరు తో మహాభారతంలో ని ఓ ఘట్టాన్ని ఈ చిత్రంలో అవిష్కరించాబోతున్నారు గుణశేఖర్. మణిశర్మ సంగీతం వహిస్తున్న ఈ సినిమా 2021 లో రిలీజ్ అవుతుందని చెప్తున్నారు..

ఇక ఈ సినిమా లో హీరోయిన్ ఎవరనేదానిపై ఇప్పుడిప్పుడే ఓ క్లైర్తి వస్తుంది. ఇన్ సైడ్ టాక్ ప్రకారం స్వీటీ అనుష్క పేరే గట్టిగా వినిపిస్తోంది. రుద్రమదేవిలో తనను గుణశేఖర్ ఎంత అద్భుతంగా చూపించారో తెలిసిందే. ఇది అలాంటి బ్యాక్ డ్రాప్ కానప్పటికీ పెర్ఫార్మన్స్ కి చాలా స్కోప్ ఉన్న పాత్ర కావడంతో అనుష్క తప్ప ఇంకెవరైనా బెస్ట్ ఛాయస్ అనిపించుకోరని ఆయన అభిప్రాయమట. దీనికి సంబంధించిన క్లారిటీ త్వరలోనే వచ్చే అవకాశం ఉంది. ఇక గుణశేఖర్ మణిశర్మల కాంబినేషన్ వచ్చి కూడా చాలా కాలమయ్యింది. చూడాలని ఉంది-ఒక్కడు లాంటి ఆల్ టైం మ్యూజికల్ హిట్స్ వీళ్ళ కాంబోలో వచ్చాయి. మరి ఈ సినిమా మ్యూజికల్ హిట్ గా నిలుస్తుందా చూడాలి..

గుణశేఖర్ హిరణ్య కశ్యప పై క్లారిటీ ఇచ్చినట్లేనా..?

విజయ్ కి త్రుటిలో జారిన రికార్డు..?

పుష్ప సినిమా షూటింగ్ పై ఇంకా వీడని సందేహం..

మళ్ళీ త్రివిక్రమ్ ఆమెనే తీసుకుంటున్నాడా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -