Saturday, April 20, 2024
- Advertisement -

హీరోయిన్‌కు లిప్ లాక్ ఇచ్చిన రాహుల్.. వీడియో వైరల్..!

- Advertisement -

బిగ్ బాస్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్.. రెండో సీజన్ కంటెస్టెంట్ నందినీ రాయ్ కలిసి ఓ ప్రైవేట్ ఆల్బమ్‌లో కలిసి నటించిన విషయం తెలిసిందే. ఆ ఆల్బమ్‌లో నందినీ, రాహుల్ రెచ్చిపోయి నటించారు. లిప్ లాక్‌ కూడా చేశారు. ఈ వీడీయోని తాజాగా షేర్ చేసిన రాహుల్ ఆసక్తికరమైన కామెంట్ చేశాడు. దీనికి అషూ రెడ్డి చేసిన కామెంట్స్, రాహుల్ రిప్లై తెగ వైరల్ అవుతున్నాయి.

విషయంలోకి వెళ్తే.. రాహుల్ సిప్లిగంజ్ ప్లే బ్యాక్ సింగర్, ప్రైవేట్ ఆల్బమ్స్‌తో బాగా ఫేమస్ అయ్యాడు. అయితే బిగ్ బాస్ ద్వారా అతనికి మరింత క్రేజ్ పేరిగింది. బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన రాహుల్ ఫుల్ బిజీ అయ్యాడు. ఓ వైపు పాటలు పాడుతూ బిజీగా ఉంటూ.. మరో వైపు నటనలోనూ రంగ ప్రవేశం చేశాడు. కృష్ణ వంశీ దర్శకత్వంలో రాబోతోన్న రంగమార్తాండ చిత్రంలో ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. నందినీ రాయ్‌తో ఫుల్ రొమాన్స్ చేస్తున్న వీడియోను రాహుల్ షేర్ చేశాడు.

ఈ వీడియోకు అషూ చేసిన కామెంట్ తెగ వైరల్ అవుతోంది. బిగ్ బాస్ హౌస్‌లో అషూ చేసిన అల్లరి వేసిన పంచ్‌లు, రాహుల్‌ను ఆట పట్టించిన విధానం అందరికీ తెలిసిందే. అదే మాదిరిగా తాజాగా ఓ బోల్డ్ కామెంట్ చేసింది. లిప్ లాక్ సీన్‌ను ఉద్దేశిస్తూ.. వావ్ ఇది నేను చూడలే అంటూ సెటైర్ వేసింది. దీనికి స్పందించిన రాహుల్.. అబ్బో ఇక నేను చచ్చిపోతా అంటూ కామెంట్ చేశాడు. మళ్లీ ప్రతీగా స్పందించిన అషూ.. మినిమమ్ ఉంటాయ్ కదా నీ వీడియోస్‌లో అంటూ నవ్వేసింది. ఇక ఆ వీడియో మీరు కూడా చూసేయండి.

https://www.instagram.com/p/B-9hW9mHaly/?utm_source=ig_embed

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -