బిగ్ బాస్ : శ్రీముఖి కంటే బాబా మాస్టరేకే ఎక్కువ ఓట్లు..!

4019
Baba Master Has More Chances Than Srimukhi
Baba Master Has More Chances Than Srimukhi

తెలుగులో బాగా పాపులర్ అయిన బిగ్ బాస్ షో చివరి దశకు చేరుకోవడంతో చాలా ఉత్కంఠంగా సాగుతోంది. నామినేషన్ లో ఉన్న ఐదుగురు ఇంటి సభ్యుల్లో ఎవరు టాప్ ఫైవ్ ఫినాలేకి వెళ్తారు.. ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది చాలా ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే సింగర్ రాహుల్ టికెట్ టు ఫినాలే గెలుచుకుని టాఫ్ -5 లోకి వెళ్లాడు.

అయితే తాజాగా జరిగిన ఎపిసోడ్ ప్రేక్షకులను మరింత ఉత్కంఠకు గురి చేసింది. ఎవరు ఊహించని బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. హౌస్ లో తెల్లవారుజాము 3:30 నిమిషాలకు సైరన్ మోగింది. అప్పుడే తెల్లారిందా అని ఉల్కిపడిన ఇంటి సభ్యులు వెంటనే లేచి చూశారు. నామినేషన్ లో ఉన్న ఇంటి సభ్యులు లగేజ్ సర్దుకుని గార్డెన్ ఏరియాలోకి రావాల్సిందిగా బిగ్ బాస్ సూచించాడు. దాని ప్రకారమే ఇంటి సభ్యులు చేశారు. వరసక్రమంలో నిలబెట్టాడు.

బిగ్ బాస్ హౌస్ లో ఏం నేర్చుకున్నారో.. ఈ జర్నీ ఎలా అనిపించిందో చెప్పాలని చూచించాడు. అందరు తాము ఏం నేర్చుకున్నామో చెప్పిన తర్వాత.. ప్రేక్షకుల తీర్పు వచ్చిందని చెప్పి.. నామినేషన్ లో ఉన్న ఐదుగురిపై లైట్లు వేస్తూ టెన్షన్ పెట్టాడు. చివరికి గ్రీన్ లైట్ బాబా భాస్కర్ మాస్టర్ పై పడటంతో.. ఆయనను ప్రేక్షకులు సేవ్ చేశారని.. టికెట్ టు ఫినాలే గెలుచుకుని.. టాప్ 5లోకి వెళ్లారని ప్రకటించాడు. దాంతో బాబా సంతోషంను వ్యక్తం చేసి ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పాడు.

ఇక నామినేషన్లో శ్రీముఖి, అలీ, శివజ్యోతి ఉన్నారు. నిజానికి అందరికంటే ముందే శ్రీముఖి సేవ్ అవుతుందని అందరు అనుకున్నారు. అంతేకాకుండా ఆమెనే బిగ్ బాస్ విన్నర్ అయ్యే ఛాన్సులు కూడా ఎక్కువగా ఉన్నాయని ప్రచారం కూడా సాగింది. కానీ ఎవరు ఊహించని విధంగా బాబా సేవ్ అయ్యాడు. దీని బట్టి చూస్తే శ్రీముఖి కంటే బాబానే ప్రేక్షకులు ఎక్కువ ఇష్టపడుతున్నారని అర్దం అవుతోంది. రాహుల్ కూడా ఫైనల్ కు వెళ్లినప్పుడు శ్రీముఖి ముఖం మార్చుకుంది.

అప్పుడు వారిద్దరికి పడట్లేదు కాబట్టి అలా చేసింది అనుకున్నారు. కానీ బాబా బాస్కర్, శ్రీముఖి క్లోజ్ గా ఉంటారు. బాబా మాస్టర్ టాప్ 5లోకి వెళ్లినప్పుడు కూడా శ్రీముఖి ముఖం మార్చుకుంది. పైకి మాత్రం నటిస్తుందని క్లీయర్ గా అర్దం అవుతోంది. శ్రీముఖి వ్యక్తిత్వం బయటకు రావడం వల్లే ఆమెకి ప్రేక్షకులు ఓట్లు వేయడం లేదని తెలుస్తోంది.

అందుకు చిన్న ఉదహారణ తాజాగా శ్రీముఖి కంటే బాబా భాస్కర్ కు ఎక్కువ ఓట్లు వేసి టికెట్ టు ఫినాలే కు పంపించడమే. శ్రీముఖికి ఇలానే ఓట్లు పడితే ఆమె నామినేషన్ నుంచి ఎలిమినేట్ అయ్యే ఛాన్సులు కూడా ఉన్నాయి. ఇక ఫినాలే పోరులో రాహుల్ లేదా వరుణ్ విజేతగా నిలిచే అవకాశం ఉందని తెలుస్తోంది.

Loading...