Thursday, April 25, 2024
- Advertisement -

ఎన్టీఆర్ భార్యకు క్యాన్సర్.. ట్రీట్‌మెంట్ చేయిస్తున్న బాలకృష్ణ..!

- Advertisement -

నందమూరి బాలకృష్ణకు ఇండస్ట్రీలో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆయన సినిమాల్లో మంచి విషయాలపై ఎక్కువగా ఫోకస్ పెడుతుంటారు. అలానే బయట ఎవరైన సమస్యలో ఉంటే వెంటనే నేను ఉన్నా అంటూ ముందుకు వస్తారు. బాలయ్య మంచితనం గురించి ఇప్పటికే అయనను దగ్గరగా చూసిన చాలా మంది చెప్పిన విషయం తెలిసిందే.

చాలా సామాజిక కార్యక్రమాలు చేస్తూ బాలయ్య తన మంచితనాన్ని ఎప్పటికప్పుడు చాటుకుంటున్నారు. అయితే తాజాగా ఎన్టీఆర్ భార్యకు క్యాన్సర్ సోకిందని తెలుసుకుని ఆమెను బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో చేర్పించి వైద్యులచే ఉత్తమ వైద్యసేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నాడు బాలయ్య. ఎన్టీఆర్ భార్యకు క్యాన్సర్ వచ్చిందా? అని ఆశ్చర్యపోకండి. విషయం ఏంటంటే.. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రలో నటించిన పి.విజయ్ కుమార్ భార్యకు క్యాన్సర్ ఉందని తేలింది.

దాంతో ఆయన తన భార్యను బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి తీసుకురాగా, విషయం తెలుసుకున్న బాలయ్య ఆమెకు మెరుగైన వైద్యసేవలు అందేలా చూడాలని వైద్యులను కోరినట్లు తెలుస్తోంది. ఏది ఏమైన బాలయ్య బాబు మనసు గొప్పది అని ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక బాలయ్య ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -