Wednesday, April 17, 2024
- Advertisement -

చిరు ఇంట్లో జరిగిన 80స్ క్లబ్ రీ యూనియన్ కి నన్ను పిలవలేదు : బాలయ్య

- Advertisement -

నందమూరి, మెగా ఫ్యామిలీల మధ్య ఏదో ఒక వివాదం జరుగుతూనే ఉంది. ఇటీవలే ఇండస్ట్రీ పెద్దలు మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో సమావేశం ఏర్పాటు చేసుకుని తనని పిలవలేదని బాలయ్య షాకింగ్ కామెంట్స్ చేశారు. నన్నెవరూ పిలవలేదు.. ఒక్కడు కూడా పిలవలేదు. ఇండస్ట్రీలో భూములు పంచుకుంటున్నారా అంటూ వ్యాఖ్యలు చేశారు. బాలయ్య వ్యాఖ్యలపై మెగా బ్రదర్ నాగబాబు విరుచుకుపడ్డారు. ఆ తర్వాత ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో సమావేశానికి ఇండస్ట్రీ పెద్దలు బాలయ్యను ఇన్వైట్ చేయగా బర్త్ డే ఉండటం వలన రాలేనని చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే ఈ సమావేశానికి నన్ను పిలవలేదు అని బాలయ్య వ్యాఖ్యానించారు. ఇక ప్రతి ఏడాది 80స్ క్లబ్ పేరుతో అప్పటి హీరో హీరోయిన్స్ రీయూనియన్ అవుతూ ఉంటారు.

ఎవరో ఒకరి ఇంట్లో మీట్ అవుతూ అప్పటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. గతేడాది చిరంజీవి హైదరాబాద్ లోని తన నివాసంలో 10వ రీ యూనియన్ ఏర్పాటు చేసారు. ఈ పార్టీకి అలనాటి నటీనటులు అందరూ హాజరయ్యి ఆటపాటలతో ఎంజాయ్ చేసారు. దీనికి సంభందించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేసాయి. అయితే ఆ ఫోటోలలో నందమూరి బాలకృష్ణ మాత్రం కనపడలేదు. అయితే అప్పుడు బాలయ్య ఏదో షూటింగ్స్ తో బిజీగా ఉండి ఆ ప్రోగ్రామ్ కి అటెండ్ కాలేదేమో అని అందరూ అనుకున్నారు. అయితే బాలయ్య 80స్ క్లబ్ రీయూనియన్ కి హాజరు కాకపోవడానికి కారణం అది కాదని బాలయ్య వ్యాఖ్యలతో బయటపడింది.

లేటెస్టుగా బాలయ్య ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సదరు యాంకర్ ”మీరు చిరు క్లోజ్ గా అన్యోన్యంగా ఉంటారు కదా.. ఆయన షష్టి పూర్తి వేడుకలకు హాజరై సందడి చేసారు. మరి అలాంటిది చిరంజీవి డైరెక్ట్ గా మీకు కాల్ చేసి ఇన్వైట్ చేసే పరిస్థితులు లేవా” అని ప్రశ్నించారు. దీనికి బాలయ్య సమాధానం చెప్తూ.. ” ప్రతి ఏడాది ఓల్డ్ 80స్ బ్యాచ్ అందరం కలుస్తూ ఉంటాం. లాస్ట్ ఇయర్ ఇక్కడే జరిగింది. దానికి నన్ను పిలవలేదుగా. ఎందుకు పిలవాలా…? ఆయన ఇంట్లోనే జరిగింది. నన్ను పిలవలేదు. సుమలత – అంబరీష్ గారు మైసూర్ లో ఏర్పాటు చేసినప్పుడు పిలిస్తే వెళ్ళాను.. మోహన్ లాల్ గారు హోస్ట్ చేసినప్పుడు వెళ్ళాను. కానీ హైదరాబాద్ లో ఏర్పాటు చేసినప్పుడు నన్నెందుకు పిలవలేదు..?” అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా బాలయ్య మాట్లాడుతూ ”ఐ డోంట్ కేర్.. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్.. నన్ను పక్కన పెట్టాలనుకుంటే పూర్తిగా అవైడ్ చేసేయండి. నా దారిలో నేను వెళ్తా” అంటూ ఘాటుగా సమాధానం చెప్పుకొచ్చారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -