Thursday, April 25, 2024
- Advertisement -

మోక్షాజ్ఞ సినీ ఎంట్రీ పై స్పందించిన బాలయ్య..!

- Advertisement -

నందమూరి బాలకృష్ణ తన తనయుడు మోక్షాజ్ఞ సినీ ఎంట్రీ విషయంపై స్పందించారు. మోక్షాజ్ఞ ఎంట్రీ కోసం బాలయ్య అభిమానులు ఏ రేంజ్ లో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మూడేళ్ల కిందటే మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వడం గురించి సినీ వర్గాల్లో చర్చ జరిగింది. అదిగో.. ఇదిగో.. అంటూ అప్పుడే గుసగుసలు వినిపించాయి అయితే ఇప్పటివరకూ అలాంటి హడావుడి ఏమీలేదు.

అప్పుడప్పుడు మోక్షజ్ఞ మీడియాకు కనిపిస్తూ ఉన్నారు. ఒక సాధారణ యువకుడిలా అతడు కనిపిస్తున్నాడు. ఈ కాలంలో హీరో కావాలంటే వారు ఫిజిక్ తో సహా లుక్ విషయంలో చాలా మెయింటెయిన్ చేయాల్సి ఉంటుంది. కానీ బాలకృష్ణ తనయుడు మాత్రం అలా రెడీ అయినట్టుగా ఎక్కడ కనిపించడం లేదు. దాంతో అసలు బాలయ్య తనయుడికి సినిమాల్లోకి రావడం ఆసక్తి ఉందా ? లేదా ? అనే సందేహం అందరిలో కలిగింది.

ఈ నేపథ్యంలో మోక్షాజ్ఞ ఎంట్రీ పై స్వయంగా బాలయ్యనే స్పందించారు. తన తనయుడు సినీ ఎంట్రీ ఇస్తాడని బాలకృష్ణ స్పష్టం చేశారు. అయితే అదెప్పుడో చెప్పలేం అన్నట్టుగా ఆయన స్పందించారు. అన్ని అనుకున్నట్లు జరిగితే.. మోక్షజ్ఞ సినీ ఎంట్రీ తొందర్లోనే ఉంటుందని బాలయ్య అన్నారు. మోక్షాజ్ఞ సినిమాల గురించి.. కథల గురించి తనతో చర్చిస్తూ ఉంటాడని బాలకృష్ణ చెబుతున్నారు. సో బాలయ్య తనయుడి ఎంట్రీ కచ్చితంగా ఉంటుందని బాలకృష్ణ ద్వారా తెలుస్తోంది. మరి ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -