Saturday, April 20, 2024
- Advertisement -

బాలకృష్ణ సినిమా ని మహేష్ తో చేస్తున్న అనిల్?

- Advertisement -

ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమ లో ఒక ఆసక్తికర చర్చ నడుస్తుంది, సూపర్స్టార్ మహేష్ బాబు మహర్షి తో పెద్ద విజయం సాధించిన విషయం మన అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా తర్వాత మహేష్ అనిల్ రావిపూడి తో జత కట్టనున్నాడు. ఈ సినిమా కి సరిలేరు నీకెవరు అనే టైటిల్ ని కూడా ఖరారు చేయడం తో పాటు చిత్రాన్ని అధికారికం గా కూడా లాంచ్ చేశారు. దిల్ రాజు మరియు అనిల్ సుంకర సంయుక్తం గా నిర్వహిస్తున్న ఈ చిత్రం లో హీరోయిన్ గా రష్మిక నటిస్తుంది. అయితే ఆసక్తికర విషయం ఏంటి అంటే ఈ సినిమా కథ ముందుగా అనిల్ బాలకృష్ణ కి చెప్పారట.

అప్పట్లో బాలకృష్ణ తో మిలిటరీ లేదా పోలీస్ బాక్డ్రాప్ లో అనిల్ ఒక సినిమా ని చేయాలనీ చర్చలు చేశారు. కొన్ని కారణాల వలన ఆ సినిమా అప్పుడు అటకెక్కింది. అయితే ఈ కథ కె కొన్ని మార్పులు చేర్పులు చేసి అనిల్ మహేష్ ని ఒప్పించాడు అని, ఈ కథ తో మహేష్ ప్రయోగం చేయబోతున్నాడు అనే చర్చ నడుస్తుంది.

కాకపోతే కొంత మంది మాత్రం ఇది పూర్తిగా కొత్త పాయింట్ అని, బాలకృష్ణ తో చేయబోయే కథ కి దీనికి పోలికలు లేవు అని వాదిస్తున్నారు కూడా. అయితే అనిల్ రావిపూడి అధికారికంగా స్పందించే వరకు ఏది నిజమో ఏది అబద్దమో చెప్పడం నిజంగా కష్టమే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -