Friday, March 29, 2024
- Advertisement -

పవన్ కళ్యాణ్ – బండ్ల గణేష్ – బోయపాటి

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల్లో నుంచున్నారు. అయితే ఏదో ఒక చోటు నుండి కచ్చితంగా గెలుస్తాడు అని అనుకుంటే, రెండు నియోజకవర్గాల నుండి ఓడిపోవడం తో ఆయన లో, ఆయన పార్టీ శ్రేణుల్లో నిరాశ నిండుకుంది. అయితే మరో అయిదేళ్ల వరకు ఎన్నికలు లేకపోవడం తో ఈ అవకాశాన్ని వినియోగించుకొని పార్టీ ని బలోపేతం చేయాలనీ పవన్ కళ్యాణ్ చూస్తున్నట్లు తెలుస్తుంది. ఇక పోతే ఇందుకోసం పవన్ కళ్యాణ్ సినిమా అనే మాధ్యమాన్ని కూడా వాడాలని అనుకుంటున్నారట. సినిమాలు చేస్తే డబ్బు వస్తుంది, దాని తో పాటు కాస్త జనాలని ఉత్తేజ పరచవచ్చు అనే ఆలోచన తో ఉన్నారని తెలుస్తుంది.

ఈ సందర్భాన్ని బండ్ల గణేష్ కాష్ చేసుకోనున్నారట. ఆయన ఇప్పటికే పవన్ కళ్యాణ్ ని కలవాలని అపాయింట్మెంట్ కోరినట్టు సమాచారం. బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ ని హీరో గా పెట్టి బోయపాటి శ్రీను దర్శకత్వం లో ఒక సినిమా చేయాలి అని ఆశిస్తున్నారు. బోయపాటి కి అడ్వాంస్ ఇచ్చి ఒక మంచి పవర్ఫుల్ పొలిటికల్ స్క్రిప్ట్ చేయమని కూడా అడిగినట్టు సమాచారం. ఈ సినిమా ని త్వరలో పట్టాలెక్కించి ఈ ఏడాది చివరికల్లా సగం షూటింగ్ అయినా పూర్తి చేయాలని గణేష్ భావిస్తున్నట్టు తెలుస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -