Saturday, April 20, 2024
- Advertisement -

అల్లు అర్జున్ ‘పుష్ప’ మూవీ స్టోరీ ఇదే ?

- Advertisement -

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – స్టైలిష్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తోన్న సినిమాకు ‘పుష్ప’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. అల్లు అర్జున్ పుట్టినరోజును పురష్కరించుకుని ఈ చిత్ర టైటిల్ ను ప్రకటించారు. అలాగే ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్ లో అల్లు అర్జున్ ఊర మాస్ లుక్ లో అదరగొట్టారు.

మాసిన గెడ్డం మీసాలతో సీరియస్గా ఉన్న బన్నీ లుక్ చాలా కొత్తగా ఉంది. అలాగే ఆయన వేసుకున్న షర్ట్ కూడా పాత స్టైల్లో ఉంది. ఇక ఇప్పటికే ఈ సినిమా ఎర్రచందనం బ్యాక్ డ్రాప్ లో జరుగుతుందన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమాకు సంబంధించి కథ ఇదే అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వినిపిస్తోంది. ఎర్రచందనం స్మగ్లర్ల వలన పుష్పక్ నారాయణ్ కుటుంబానికి అన్యాయం జరుగుతుందట. దాంతో తన కుటుంబానికి అన్యాయం చేసిన స్మగ్లర్ల ఆటకట్టించడం కోసమే పుష్పక్ నారాయణ్ స్మగ్లర్ గా మారుతాడట.

యాక్షన్ కి ఒక రేంజ్ లో అవకాశం వుండే కలప అక్రమ రవాణ .. అడవి నేపథ్యం, ఎమోషన్ కి అవకాశం వుండే ఫ్యామిలీ సెంటిమెంట్ తో ఈ కథను సుకుమార్ చాలా ఇంట్రెస్టింగ్ గా అల్లినట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక కథానాయికగా నటిస్తుండగా.. విలన్ గా విజయ్ సేతుపతి నటిస్తున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -