Wednesday, April 24, 2024
- Advertisement -

బిగ్‌బాస్‌లోకి శివ‌బాలాజీ?

- Advertisement -

తెలుగు బిగ్ బాస్ రెండో సీజ‌న్‌పై మొద‌ట్లో కాస్తా వ్య‌తిరేక‌త ఉన్న‌ప్ప‌టికి దానిని చాల త‌క్కువ స‌మ‌యంలోనే స‌రిదిద్దుకోగలిగారు బిగ్ బాస్ టీం.ఇప్పుడు మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా న‌డుస్తుందని అన‌డంలో ఎటువంటి సందేహం లేదు.తాజాగా బిగ్ బాస్‌కు సంబంధించిన వార్త ఒక‌టి సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది.బిగ్ బాస్ మొద‌టి సీజ‌న్ విన్న‌ర్ శివ బాలాజీ బిగ్‌బాస్ రెండో సీజ‌న్‌లో క‌నిపించ‌నున్నార‌ని స‌మ‌చారం.అయితే సెల‌బ్రిటీగా కాదులేండీ…జ‌స్ట్ గెస్ట్‌గా కాసేపు క‌నిపించి వెళ్లిపోతాట‌!

షోలో అంద‌రిని ఎంక‌రేజ్ చేసి కొంచెసేపు వాళ్ల‌తో ముచ్చ‌టించి వెళ్లిపోనున్నార‌ని స‌మాచారం. ఇక ఈ వారం బిగ్‌బాస్ హోస్‌లోకి ఎలిమినేట్ అయిన వారిలో ఒక‌రు తిరిగి వ‌చ్చే అవ‌కాశం క‌ల్పించింది బిగ్‌బాస్ టీం.దీంతో షో నుండి ఎలిమినేట్ అయిన వారు సోష‌ల్ మీడియాలో త‌మ‌కు ఓట్లు వేయ‌మ‌ని అడ‌గ‌టం మొద‌లు పెట్టిన సంగ‌తి తెలిసిందే.ఇక షోలో తీవ్ర గొడ‌వ‌లు జ‌రుగుతునే ఉన్నాయి.కౌశ‌ల్‌పై బాబు గోగినేని,త‌నీష్‌లు కోపంగా ఉంటు అత‌నిని ఒంట‌రి చేస్తున్నార‌ని బ‌య‌ట చూస్తున్న జ‌నాలు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -