Friday, April 19, 2024
- Advertisement -

జబర్దస్త్ లో రష్మీ ప్లేస్ లో కొత్త యాంకర్.. ఎవరో తెలుసా..?

- Advertisement -

హరితేజ.. యాంకర్ గా చేసి.. కొన్ని సీరియల్స్ లో నటించింది. ఆమె కొన్ని సినిమాలో చిన్న చిన్న పాత్రలు పోషించింది. ఆ తర్వాత తాజాగా వచ్చిన బిగ్ బాస్ షో ద్వారా హరితేజ బాగా ఫాపులర్ అయ్యింది. ఆమెలో ఉన్న ఎనర్జిని, ప్రతిభను బిగ్‌బాస్‌ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు తెలిసేలా చేసింది. హరితేజ ప్రతిభను చూసినవారు కొందరు షో నిర్వాహకులు హరితేజను కలవడం జరిగింది. హరితేజ మాత్రం ఇప్పటి వరకు ఏ ఒక్క ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పింది లేదు.

రెండున్నర నెలలు కుటుంబంకు దూరంగా ఉన్న కారణంగా ప్రస్తుతం ఫ్యామిలీకే ఎక్కువ సమయం కేటాయిస్తుంది. త్వరలోనే రీఎంట్రీకి రెడీ అవుతున్నట్లు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలిపింది. మల్లెమాల వారు హరితేజను ఒక షోకు యాంకర్‌గా బుక్‌ చేయడం జరిగిందని తెలుస్తోంది. మరి హరితేజ యాంకర్ గా చేయబోతున్న షో ఏంటా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మల్లెమాల అనే పేరు వినిపించగానే ఠక్కున జబర్దస్త్‌ గుర్తు వస్తోంది. అందుకే జబర్దస్త్‌కు హరితేజను యాంకర్‌గా తీసుకు రాబోతుందా అనే అనుమనాు వ్యక్తం అవుతున్నాయి.

ఎక్స్‌ట్రా జబర్దస్త్‌లకు ప్రస్తుతం రష్మీ యాంకర్ గా చేస్తోంది. రష్మీని తొలగించాలని నిర్ణయించుకున్నారని.. చర్చలు కూడా జరుగుతున్నాయని కొందరు చెబుతున్నారు. హరితేజకు తన ఎనర్జితో జబర్దస్త్‌ను మరింత జబర్దస్త్‌గా నడిపించగల సత్తా ఉందని, అందుకే ఆమెను యాంకర్‌గా తీసుకున్నట్లుగా చెబుతున్నారు. ఇక రష్మీకి కూడా సినిమా ఆఫర్స్ బాగా వస్తున్నాయి. అందుకే రష్మీ ప్లేస్ లోకి హరితేజను ఎంపిక చేశారనే టాక్‌ వస్తోంది. మరి ఈ విషయంలో అధికార ప్రకటన రావాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -