బిగ్ బాస్ 3 : శ్రీముఖి వల్లే రాహుల్ కు ఛాన్స్

607
bigg boss 3 telugu rahul is trolling on recommend word about srimukhi
bigg boss 3 telugu rahul is trolling on recommend word about srimukhi

బిగ్ బాస్ తెలుగు మూడో సీజన్ ఎంత సరదగా సాగుతుందో అంతే గొడవలు జరుగుతున్నాయి. రెండో నెంబర్ కోసం రాహుల్, శ్రీముఖి మధ్య ఎలాంటి వాగ్వాదం జరిగిందో తెలిసిందే. ఇటీవలే జరిగిన ఎపిసోడ్ లో కూడా అలాంటి సంఘటనే చోటు చేసుకుంది. నామినేషన్ ప్రక్రియలో భాగంగా రాహుల్, శ్రీముఖిల మధ్య మాటల యుద్దం జరిగింది. గయ్యాలి గంప అని రాహుల్ ఫైర్ అవగా.. శ్రీముఖి కూడా తగ్గకుండా రెచ్చిపోయింది.

బాబా మాస్టర్ ఎలాగో ఫస్ట్ నెంబర్ ఇస్తాడని తెలిసినప్పటికి.. కావాలనే తనను బ్లేమ్ చేయాలని.. తనతో వాగ్వాదం కు దిగాలనే కారణంతోనే తన వద్దకు వచ్చిందని.. అలీ, శివజ్యోతిలతో రాహుల్ చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఇటీవలే టాస్క్ లో భాగంగా మళ్లీ ఇదే అంశం ముందుకు వచ్చింది. పాత విషయాన్ని రాహుల్ మాటల్లో మాట ముందుకు తీసుకొచ్చాడు. తనను బిగ్ బాస్ షోకు శ్రీముఖే రిఫర్ చేసిందంటూ.. అలా వరుణ్, వితికాలతో చెప్పుకుంది.. ఆ విషయాన్ని వారు తనతో చెప్పారని బయట పెట్టాడు.

దీనిపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది. అలా తాను అన్నానని నిరూపిస్తే.. వెంటనే బయటకు వెళ్తానని శ్రీముఖి చెప్పగా.. ఒకవేళ రికమండ్ అనే వర్డ్ యూస్ చేయలేదని నిరూపిస్తే తానూ బయటకు వెళ్తానని అన్నాడు. అయితే నాగార్జున ఈ విషయం అక్కడే క్లియర్ చేసే ఛాన్స్ ఉన్నప్పటికి ఆ పని చేయలేదు. పాత వీడియోలను ప్లే చేసి చూపించకుండా.. మాటలతో సరిపెట్టాడు. అయితే నెటిజన్లు సోషల్ మీడియాలో ఈ విషయంపై రాహుల్ ను టార్గెట్ చేశారు.

అప్పటి సంభాషనకు సంబంధించిన వీడియోను ట్యాగ్ చేస్తూ.. శ్రీముఖి అలా అనలేదంటూ నిరూపించారు. మరి బయటకు వెళ్తా అన్నావ్ కదా వెళ్లిపో అంటూ చురకలంటించారు. దాంతో రాహుల్ ఫ్యాన్స్ శ్రీముఖి ఏమన్నా తక్కువనా.. చేసేదంతా చేసి.. ఏం తెలియనట్లు నటిస్తాది.. ఆమె తప్పులు కూడా చాలానే ఉన్నాయని రివర్స్ కౌంటర్లు ఇస్తున్నారు.

Loading...