Saturday, April 20, 2024
- Advertisement -

రాహుల్ గెలిస్తే.. వాళ్ల సపోర్ట్ నాకే ఉంది : శ్రీముఖి..!

- Advertisement -

బిగ్ బాస్ మూడో సీజన్ ఇటీవలే ముగిసింది. ఈ సీజన్ లో శ్రీముఖి విన్నర్ గా నిలుస్తోంది అని అనుకున్నప్పటికి ఎవరు ఊహించని విధంగా రాహుల్ గెలిచాడు. ఇక శ్రీముఖి రన్నర్ గా నిలిచింది. శ్రీముఖి పదే పదే రాహుల్ ను టార్గెట్ చేయడం వల్ల శ్రీముఖిపై నెగిటివ్ టాక్ ఏర్పడింది. రాహుల్ పై సింపతీ వర్క్ వట్ అయింది. దాంతో జనాలు రాహుల్ కి ఎక్కువ ఓట్లు వేసి గెలిపించారు.

ఈ విషయంపై తాజాగా శ్రీముఖి స్పందించింది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మాల్దీవులకు వెళ్లి అక్కడ ఎంజాయ్ చేసింది. దాదాపు వారం అక్కడే ఫ్రెండ్స్ తో సరదగా గడిపింది. అక్కడ నుంచి వచ్చిన తర్వాత లైవ్ లోకి వచ్చి ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు జవాబులు ఇచ్చింది. రాహుల్ నా ఫ్రెండ్.. ఇప్పుడు కూడా నా ఫ్రెండే. హౌస్ లో ఉన్న పరిస్థితుల కారణంగా మా మధ్య గొడవలు వచ్చాయి అంతే. బయటకు వచ్చిన తర్వాత వాటిని నేను మర్చిపోయాను.

రాహుల్ ఎప్పటికి నాకు ఫ్రెండే అని చెప్పింది. తనకు బాగా సపోర్ట్ చేసిన ఫ్యాన్స్ కి చాలా థ్యాంక్స్. ఝాన్సీ, రష్మీ, ముక్కు అవినాష్ ఇలా వ్యక్తిగతంగా తెలిసిన ప్రతీ ఒక్కరూ నాకు సపోర్ట్ చేశారు అందరికీ చాలా థ్యాంక్స్. ఇక తన చేతిపై పొడిపించుకున్న ట్యాటూ నకిలీదనని అందరు అనుకుంటున్నారు. అందుకే చూపించమని అడుగుతున్నారు.

మా తమ్ముడిని దానిపై రుద్దమంటాను.. మీకు ఇంకా క్లారిటీ వస్తుందని తెలిపింది. శ్రీముఖి చేతిపై ఉన్న పచ్చబొట్టును శుశ్రుత్ రుద్దుతుండగా లైవ్‌లో చూపించి అందరి అనుమానాలను పటాపంచలు చేసింది. అయితే నిజానికి రాహుల్ టైటిల్ గెల్చుకుని సంపాధించిన దానికంటే శ్రీముఖి హౌస్ లోకి వెళ్లి సంపాధించింది ఎక్కువ. సో టైటిల్ గెలిస్తే ఏంటి అన్నట్లు శ్రీముఖి లైవ్ లో బిహేవ్ చేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -